సినిమాల్లో హీరో అవుదామనుకుని.. చివరికి సీరియల్ లో హీరోగా మారి.. అటు వెండితెర పై కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్న మానస్ నాగులపల్లి.. బిగ్ బాస్ సీజన్ 5 లోకి ఎంటరైన దగ్గరనుండి మిస్టర్ పర్ఫెక్ట్ గా కనిపించాడు. శ్రీరామ్ తో కోల్డ్ వార్, ప్రియాంకతో లవ్లీ ఫ్రెండ్షిప్, సన్నీ తో మంచి ఫ్రెండ్ షిప్ చేసిన మానస్ టాప్ 5 కి వెళ్ళినా కేవలం టాప్ 4 వరకు వెళ్లి వెనక్కి తిరిగాడు. హౌస్ మొత్తంలో కూల్ పర్సన్ గా, ఎవరితోనూ శత్రుత్వం పెట్టుకొని మానస్ టాస్క్ ల పరంగా కొద్దిగా వీక్ గా ఉండడం, ఫాన్స్ పరంగా ఫాలోయింగ్ తక్కువగా ఉండడంతో.. జస్ట్ 4th ప్లేస్ కే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
అయితే 105 డేస్ బిగ్ బాస్ హౌస్ లో ఉన్న మానస్ కి బిగ్ బాస్ నుండి మంచి పారితోషకమే అందినట్టుగా తెలుస్తుంది. వారానికి లక్ష నుండి లక్షన్నర పారితోషకం మానస్ బిగ్ బాస్ యాజమాన్యం నుండి వసూలు చేసినట్టుగా తెలుస్తుంది. అంటే 105 రోజులకి 15 వారాలకి కలిపి మానస్ ఓ 20 లక్షల పారితోషకం అందుకున్నాడని అంటున్నారు. ప్రస్తుతం మానస్ సన్నీ తో కలిసి దోస్తానా అంటూ యూట్యూబ్ ఛానల్స్, టివి ఛానల్స్ ఇంటర్వూస్ తో క్షణం ఖాళీ లేకుండా గడిపేస్తున్నాడు. మరి మానస్ కి బిగ్ బాస్ ఏం ఆఫర్స్ ఇస్తుందో చూడాలి.