పూజ హెగ్డే ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో నెంబర్ వన్ యాక్ట్రెస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అందరి బిగ్ స్టార్స్ పక్కన చేస్తోంది. అల్లు అర్జున్ తో రెండు సార్లు హిట్ కొట్టింది. జూనియర్ ఎన్ టి ఆర్ తో హిట్ కొట్టింది. మహేష్ బాబు తో రెండో సారి చెయ్యడానికి రెడీ అయిపోతోంది. చరణ్ అండ్ ప్రభాస్ తో చేసిన సినిమాలు రిలీజ్ కి రెడీ గా వున్నాయి. ఇంత డిమాండ్ లో వున్న పూజ హెగ్డేకి తన పని పట్ల వున్న అంకిత భావమే ఆమెని ఆ టాప్ స్లాట్ లో కూర్చోపెట్టింది.
గురువారం జరిగిన రాధే శ్యామ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి పూజ ఆ రోజు ఉదయమే హైదరాబాద్ వచ్చేసింది. అంతకు ముందు రోజే ఆమె ముంబై లో హిందీ సినిమా సర్కస్ షూటింగ్ చేసి వెంటనే హైదరాబాద్ బయలుదేరింది. ఖాళీగా ఉండకుండా రాధే శ్యామ్ డబ్బింగ్ కూడా తనే చెప్పుకుంది. మధ్యలో ఇంస్టాగ్రామ్ లో లైవ్ మాట్లాడింది. ముంబై టు హైదరాబాద్ అలుపెరగకుండా తిరుగుతూ నిర్మాతలను, దర్శకులని ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతో హార్డ్ వర్క్ చెయ్యాలని నిర్ణయించుకుంది. అందుకే దర్శకుడు హరీష్ శంకర్ తన తదుపరి సినిమా పవన్ కళ్యాణ్ తో పూజ హెగ్డే నే హీరోయిన్ అని ఓపెన్ గా అనౌన్స్ చేసాడు. నిన్న రాధే శ్యామ్ ఈవెంట్ లో కూడా కృష్ణం రాజు గారి పాదాలకి నమస్కరించింది. హిందీ నుండి వచ్చిన వాళ్ళు ఇలా చెయ్యటం చాలా అరుదుగా చూస్తాము.