Advertisementt

హీరోల రెమ్యునరేషన్ పై మినిస్టర్ హాట్ కామెంట్స్

Fri 24th Dec 2021 12:39 PM
tollywood,hero nani,kodali nani,ap minister anil reddy,heroes remuneration,pawan kalyan,vakeel saab,bheemla nayak  హీరోల రెమ్యునరేషన్ పై మినిస్టర్ హాట్ కామెంట్స్
AP Minister hot comments on Heroes' Remuneration హీరోల రెమ్యునరేషన్ పై మినిస్టర్ హాట్ కామెంట్స్
Advertisement
Ads by CJ

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ vs ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా ఉంది వ్యవహారం. టాలీవుడ్ ని తొక్కేయాలని ఏపీ ప్రభుత్వం చూస్తుంది అని, టికెట్ రేట్స్ విషయంలో జరుగుతున్న రగడ విషయం పవన్ కళ్యాణ్ ఓ ఈవెంట్ లో మాట్లాడడంతో ఆయనపై ఏపీ మంత్రులు విరుచుకుపడిపోయారు. పవన్ కళ్యాణ్ ని నానా మాటలు అన్నారు. దెబ్బకి ఇండస్ట్రీ సైలెంట్ అయ్యింది. పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేసినవాళ్లు ఒక్కళ్ళు లేరు. రీసెంట్ గా నాని శ్యామ్ సింగ రాయ్ ప్రెస్ మీట్ లో ఏపీ ప్రభుత్వం టికెట్ ప్రైస్ తగ్గించి ఆడియన్స్ ని అవమాన పరిచింది, థియేటర్స్ కన్నా కిరాణా కొట్టుకు లాభాలొస్తున్నాయ్ అని అన్నాడో లేదో... ఏపీ మంత్రులు రంగంలోకి దిగిపోయారు. కొడాలి, బొత్స లాంటివాళ్లు నాని పై విరుచుకుపడుతున్నారు. 

ఇక ఈ రోజు శుక్రవారం ఏపీ మినిస్టర్ అనిల్ రెడ్డి నాని వ్యాఖ్యలపై విరుచుకుపడుతూ.. మాకు ఏ నానీలు తెలియదు తెలిసిందల్లా మా మంత్రి కొడాలి నాని అన్న ఒకడే.. సినిమా ఇండస్ట్రీలో జరిగే దోపిడీ ని అరికట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. హీరోల రెమ్యునరేషన్ 70 శాతం ఉంటే.. ప్రొడక్షన్ ఖర్చు 30 శాతం ఉంటుంది. పవన్ కళ్యాణ్ ప్రజలని ఉద్దరించేవాడైతే.. రెమ్యునరేషన్ తీసుకోకుండా ఫ్రీగా సినిమాలు చేసుకోమనండి. వకీల్ సాబ్, భీమ్లా నాయక్ ఖర్చు ఎంత? ఆయన పారితోషకం ఎంత? సినిమా హీరోలు వాళ్ల రెమ్యునిరేషన్ తగ్గించు కోవచ్చు కదా.. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తుంటే సినిమాల్లో యాక్ట్ చేసే హీరోలకి ఎందుకు అంత కడుపుమంట అంటూ అనిల్ రెడ్డి సినిమా ఇండస్ట్రీపై విరుచుకుపడ్డారు. 

AP Minister hot comments on Heroes' Remuneration:

AP Minister Anil reddy comments on Heroes' Remuneration

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ