యాంకర్ అనసూయ.. జబర్దస్త్ కి లేడీ బాస్, గ్లామర్ లేడీ.. ఇలా అనసూయ అందాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ప్రెజెంట్ జబర్దస్త్ యాంకర్ గాను, వెండితెర మీద అవకాశాలు అందిపుచ్చుకుంటున్న అనసూయ ఈ వారం జబర్దస్త్ లో కనిపించలేదు. వచ్చే వారం కూడా అనసూయ ప్లేస్ లో రష్మీ కనిపిస్తుంది. కారణం అనసూయ తండ్రి ఈ మధ్యనే మృతి చెందడంతో అనసూయ జబర్దస్త్ షూటింగ్ కి దూరంగా ఉంది అంటున్నారు. ఇక అనసూయ కి రంగమ్మత్తగా వెండితెర మీద మరిచిపోలేని హిట్ ఇచ్చిన సుకుమార్ పుష్ప పాన్ ఇండియా మూవీలోనూ అనసూయకి దాక్షాయణి అనే కేరెక్టర్ ఇచ్చాడు. పుష్ప లో సునీల్ మంగళం శ్రీను భార్య గా దాక్షాయణిగా లుక్ తోనే అనసూయ అంచనాలు పెంచింది.
కానీ సినిమాలో అనసూయ పాత్రకి, అలాగే సునీల్ పాత్రకి టోటల్ గా మైనస్ మార్కులే పడ్డాయి. అదలా ఉంటే ఇప్పుడు అనసూయ పుష్ప కి తీసుకున్న పారితోషకమే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. అది అనసూయ రోజువారి పారితోషకం అందుకుందట. అంటే రోజుకి 1 నుండి 1.5 లక్షలు డిమాండ్ చేసి మరీ అనసూయ పుష్ప పారితోషకం అందుకుందట. అంటే పార్ట్ వన్ లో అనసూయ 10 రోజులకి కాల్షీట్స్ ఇవ్వగా.. అందుకు 12 లక్షల పారితోషకం అందుకుంది అని సోషల్ మీడియా టాక్. ఇక పార్ట్ వన్ లో నిడివి తక్కువ వున్న అనసూయ కేరెక్టర్.. పార్ట్2 లో ఎమన్నా పెరుగుతుందేమో చూడాలి.