Advertisementt

బిగ్ బాస్: శ్రీరామ చంద్రకి డాక్టర్స్ షాక్

Fri 24th Dec 2021 10:25 AM
bigg boss telugu 5,bigg boss,sreerama chandra,srirama chandra injured legs  బిగ్ బాస్: శ్రీరామ చంద్రకి డాక్టర్స్ షాక్
Bigg Boss 5: SreeRama Chandra About His Injured Legs బిగ్ బాస్: శ్రీరామ చంద్రకి డాక్టర్స్ షాక్
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ లో టైటిల్ విన్నర్ అవుతాడనుకుని నమ్మిన బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కి షాకిస్తూ జస్ట్ టాప్ 3 కి పరిమితమైన శ్రీరామ చంద్రా.. హడావిడి ప్రస్తుతం ఛానల్స్ లోను, యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూలలోనూ కనిపించడం లేదు. చాలామంది శ్రీరామ్ చంద్రనే బిగ్ బాస్ విన్నర్ అనుకున్నారు. కానీ చివరికి సన్నీ విన్నర్ గా, షణ్ముఖ్ రన్నర్ గా నిలిచారు. అయితే శ్రీరామ్ చరణ్ బయట కనిపించకపోవడానికి చాలా పెద్ద కారణమే ఉంది. అదేమిటంటే.. శ్రీరామ్ చంద్ర కాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో దెబ్బతినడమే. బిగ్ బాస్ హౌస్ లో బిగ్ బాస్ ఇచ్చిన ఐస్ టాస్క్ వలన శ్రీరామ చరణ్, సిరి కాళ్ళు తోళ్ళు ఊడిపోయాయి. చాలారోజులు వారిద్దరూ నడవలేకపోయారు కూడా.

ఇక హౌస్ నుండి బయటికి వచ్చాక శ్రీరామ్ చంద్ర కాళ్ళు చూస్తే అయ్యబాబోయ్ అనిపించేంతగా కనిపించాయి. కాళ్ళ చర్మం ఊడిపోయింది. పింకీ చేసిన వేడి నీళ్ల కాపాడానికి శ్రీరామ్ చంద్ర ఎంతగా సఫర్ అయ్యాడో అనేది అతని పాదాలు చూస్తే తెలుస్తుంది. అయితే శ్రీరామ్ కాళ్ళ వలన తాను సరిగ్గా నడవలేకపోవడమే కాదు.. మళ్ళీ ఒకసారి డాక్టర్స్ తో చెక్ చేయించుకున్న శ్రీరామ్ కి డాక్టర్స్ షాకిచ్చారు. అదేమిటంటే శ్రీరామ్ కొన్నాళ్ళు రెస్ట్ లో ఉండాలి అని. అందుకే శ్రీరామ్ ఎక్కువగా బయట కనిపించకపోవడానికి కారణం. నిజంగా శ్రీరామ్ చంద్ర పాదాలు వీడియో చూస్తే మాములుగా లేదు.. అంత పెయిన్ ఎలా అనుభవించాడో అనిపిస్తుంది. 

Bigg Boss 5: SreeRama Chandra About His Injured Legs:

Bigg Boss Telugu 5: SreeRama Chandra About His Injured Legs

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ