Advertisementt

చరణ్ కి బాలయ్య సపోర్ట్

Thu 23rd Dec 2021 06:52 PM
rrr,ram charan,ntr,rrr hyderabad event,rajamouli,balakrishna,chiranjeevi  చరణ్ కి బాలయ్య సపోర్ట్
Balakrishna support to Ram charan చరణ్ కి బాలయ్య సపోర్ట్
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ పాన్ ఇండియా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాయి. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. నేషనల్ వైడ్ ప్రమోషన్స్ తో పాటుగా.. ప్రో కబడ్డీ ఓపెంనింగ్ సెర్మోనీ లోను చరణ్ అండ్ రామ్ చరణ్ లతో పాటుగా రాజమౌళి కూడా సందడి చేసారు. ఇక ముంబై లో ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ లని గెస్ట్ లుగా పిలవగా.. సల్మాన్ ఖాన్ ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ కోసం అందరం ఎదురు చూస్తున్నాం అని, ఆర్.ఆర్.ఆర్ మూవీ రిలీజ్ అయ్యాక నాలుగైదు నెలలు ఎలాంటి సినిమా విడుదలకాకూడదు అంటూ సంచలనంగా మాట్లాడారు.

ఇక హైదరాబాద్ లోను ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ ఒకటి ప్లాన్ చేసారని.. దానికి గెస్ట్ లుగా చిరు - బాలయ్యలు హాజరవ్వబోతున్నారనే న్యూస్ కి మెగా - నందమూరి ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. అయితే ఈ ఈవెంట్ లో స్టేజ్ పై ఓ స్కిట్ లా ప్లాన్ చేసారని.. ఎన్టీఆర్ - రామ్ చరణ్ లు ఆర్గ్యు చేసుకుంటారని, అందులో మెగాస్టార్ ఎన్టీఆర్ ని సపోర్ట్ చేస్తే.. బాలకృష్ణ రామ్ చరణ్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడేలా రాజమౌళి ప్లాన్ చేశారనే న్యూస్ సోషల్ మీడియా ని షేక్ చేస్తుంది. మరి చిరు - బాలయ్య కలిస్తేనే సెన్సేషన్. అలాంటిది యంగ్ హీరోలని ఫన్ చేస్తూ సపోర్ట్ చెయ్యడం మరింత సంచలనమే. అందుకే ఈ ఈవెంట్ పై అందరిలో ఆసక్తి అంతకంతకు పెరిగిపోయేది. 

Balakrishna support to Ram charan:

RRR Hyderabad Pre Release Event 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ