Advertisementt

బిగ్ బాస్ షణ్ముఖ్ కి గర్ల్ ఫ్రెండ్ గుడ్ బై

Thu 23rd Dec 2021 06:09 PM
bigg boss telugu,bigg boss,shanmukh,shanmukh girl friend,deepthi sunaina,shannu - deepthi breakup talk  బిగ్ బాస్ షణ్ముఖ్ కి గర్ల్ ఫ్రెండ్ గుడ్ బై
Girlfriend goodbye to Bigg Boss Shanmukh బిగ్ బాస్ షణ్ముఖ్ కి గర్ల్ ఫ్రెండ్ గుడ్ బై
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ కి క్రేజీ టైటిల్ ఫెవరెట్ గా అడుగుపెట్టి చివరికి ఉన్న క్రేజ్ పోగొట్టుకోవడమే కాక అతను చేసిన పనికి బుల్లితెర ప్రేక్షకులు బండ బూతులు తిట్టే స్టేజ్ లో బిగ్ బాస్ రన్నర్ గా మిగిలిన యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ భారీ నెగెటివిటీని మూటగట్టుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో సిరిని ఫ్రెండ్ అంటూ ఆమెతో చేసిన పనిని బుల్లితెర ప్రేక్షకులే కాదు.. ఆఖరికి షణ్ముఖ్ గర్ల్ ఫ్రెండ్ దీప్తి సునయన కూడా డైజెస్ట్ చేసుకోలేకపోతుంది. హగ్స్ కోసం, ముద్దుల కోసం బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళక్కర్లేదు.. బయట కూడా అదే చెయ్యొచ్చు అంటూ నెగెటివ్ కామెంట్స్ తో షణ్ముఖ్ ఇంకా సిరిని తిట్టిన వారే కానీ తిట్టని వారు లేరు. ఇక ముందులో దీప్తి సునయన షణ్ముఖ్ ని సపోర్ట్ చేసినా.. తర్వాత తర్వాత షణ్ముఖ్ ని వదిలేసింది.. 

షణ్ముఖ్ హౌస్ నుండి బయటికి వచ్చేముందు నుండి దీప్తి సునయన తన సోలో ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడమే కాదు.. చాలా రకాల పోస్ట్ లు పెడుతూ వస్తుంది. అందులో కనీసం నీ మనస్సాక్షితో అయినా నిజాయితీగా ఉండు అంటూ రాసింది. నా చుట్టూ నెగెటివ్ పరిస్థితులు కనిపిస్తున్నా నా జీవితాన్ని నేను ఎంజాయ్ చేస్తున్నా. 2021 నాకు ఏం బాగా అనిపించలేదు.. కానీ ఈ ఏడాది నేను చాలా నేర్చుకున్నాను అంటూ దీప్తి సునయన ఇన్స్టా లో పోస్ట్ లు పెట్టడం చూసిన వారు.. షణ్ముఖ్ తో బ్రేకప్ చేసుకోవడానికి సునయన రెడీ గా ఉంది.. అందుకే ఇలా అంటున్నారు. షణ్ముఖ్ బిగ్ బాస్ లో చేసిన పనికి దీప్తి సునయన హార్ట్ అయ్యి ఇలాంటి డెసిషన్ తీసుకుంది అంటూ ఆమెకి చాలామంది నెటిజెన్స్ సపోర్ట్ గా నిలివడం గమనార్హం.

Girlfriend goodbye to Bigg Boss Shanmukh:

Shanmukh And Deepthi Sunaina Breakup Talk

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ