Advertisementt

ఏపీ ప్రభుత్వంపై హీరో నాని సెన్సేషనల్ కామెంట్స్

Thu 23rd Dec 2021 12:49 PM
hero nani,sensational comments,ap government,shyam singha roy press meet,nani comments  ఏపీ ప్రభుత్వంపై హీరో నాని సెన్సేషనల్ కామెంట్స్
Nani Comments on AP Government ఏపీ ప్రభుత్వంపై హీరో నాని సెన్సేషనల్ కామెంట్స్
Advertisement
Ads by CJ

ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్స్ విషయంలో చేస్తున్న హడావుడిని ఇండస్ట్రీలోని చాలామంది వ్యతిరేకిస్తున్నారు. పవన్ కళ్యాణ్ బహిరంగంగానే ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించగా.. పవన్ కళ్యాణ్ కి అండగా హీరో నాని నిలబడ్డాడు కానీ.. ఇండస్ట్రీలో ఎవరూ పవన్ కి సపోర్ట్ చెయ్యలేదు. ఎవరికి వారే సైలెంట్ గా కూర్చోవడంతో.. జగన్ ప్రభుత్వం టికెట్ రేట్స్ విషయంలో చట్టాలు చేసేసింది. అయితే తాజాగా నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ మూవీ రిలీజ్ ప్రెస్ మీట్ లో నాని ఏపీ ప్రభుత్వం పై సెన్సేషనల్ కామెంట్స్ చేసారు. ఆ ప్రెస్ మీట్ లో నాని మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం టికెట్ ధర తగ్గించి ప్రేక్షకులను అవమానించింది.

థియేటర్ల కంటే పక్కనున్న కిరాణా కొట్టు కలెక్షన్ ఎక్కువైంది. టికెట్ ధర పెంచినా కొనే సామర్థ్యం ప్రేక్షకులకు ఉంది. అలాంటిది ప్రభుత్వం చట్టాలు చెయ్యడం ఏమిటో అర్ధం కావడం లేదు.. నా సినిమా రిలీజ్ టైం లో ఇప్పుడు ఏది మాట్లాడినా వివాదం అవుతుంది. ఇకపై నేచురల్ స్టార్ అనే పేరుని నా పేరు ముందు తీసెద్దాం అనుకుంటున్నా అంటూ నాని శ్యామ్ సింగ రాయ్ ప్రెస్ మీట్ లో ఏపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. మరోపక్క ఏపీ ప్రభుత్వం కొన్ని థియేటర్స్ పై దాడులు చేసి సీజ్ చెయ్యడంతో.. చాలామంది థియేటర్స్ యజమానులు స్వచ్ఛందంగా థియేటర్స్ మూసేస్తున్నారు.

Nani Comments on AP Government :

Hero Nani Sensational comments on Ap Government

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ