నాని శ్యామ్ సింగ రాయ్ రేపు శుక్రవారం డిసెంబర్ 24 న నాలుగు భషాల్లో గ్రాండ్ గా రిలీజ్ సిద్ధమైంది. మొదటిసారి భారీ బడ్జెట్ తో, నాలుగు భాషల్లో నాని శ్యామ్ సింగ రాయ్ ని రిలీజ్ చేస్తున్నాడు. గత ఏడాది వి సినిమా, ఈ ఏడాది టక్ జగదీశ్ సినిమాలు ఓటిటిలో విడుదల కావడం, మళ్లీ రెండేళ్ల తర్వాత శ్యామ్ సింగ రాయ్ తో థియేటర్స్ తో ప్రేక్షకుల ముందుకు రావడంతో నాని శ్యామ్ సింగ రాయ్ ప్రమోషన్స్ ని ఓ రేంజ్ లో నిర్వహిస్తున్నాడు. ఇక రేపు రిలీజ్ కాబోయే శ్యామ్ సింగ రాయ్ కి ఏపీ ప్రభుత్వం కాదు.. ఏపీ థియేటర్స్ యాజమాన్యాలు షాకిస్తున్నాయి.
ఇంతకుముందు టికెట్ రేట్స్ ఇష్యుతో ఏపీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీని ఇబ్బంది పెట్టగా.. ఆ టికెట్ రేట్స్ ఇష్యు కోర్టుకి వెళ్లడంతో.. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం థియేటర్స్ పై కొరడా ఝుళిపిస్తుంది. ఏపీ థియేటర్స్ లో కొంతమంది అధిక టికెట్ రేట్స్ వసూలు చేస్తున్నారని, అలాగే అధిక షోస్ వేస్తున్నారని, ఇంకా థియేటర్స్ లో అధిక రేట్లకి తినుబండారాలు అమ్ముతున్నారనే సాకుతో.. థియేటర్స్ పై దాడులు నిర్వహించి కొన్ని థియేటర్స్ ని అధికారులు సీజ్ చెయ్యగా.. కొంతమంది థియేటర్ యజమానులు ఇలాంటి పరిస్థితుల్లో థియేటర్స్ ని నడపలేమంటూ థియేటర్స్ క్లోజ్ చేసుకుని కూర్చుకుంటున్నారు.. ఇప్పటికే ఆంధ్రాలో 100 కి పైగా థియేటర్స్ ని యజమానులు స్వచ్ఛందంగా మూసెయ్యడం ఇప్పుడు నాని శ్యామ్ సింగ రాయ్ కి రిలీజ్ కి ముందే ఎదురు దెబ్బ తగిలింది. సినిమా మరికొద్దిగంటల్లో రిలీజ్ అవుతున్న టైం లో ఇలా థియేటర్స్ క్లోజ్ చేయడంపై శ్యామ్ సింగ రాయ్ మేకర్స్ వర్రీ అవుతున్నారు.
భారీ బడ్జెట్.. మధ్యలో థియేటర్స్ క్లోజ్ అవడం, కలెక్షన్స్ రావు, అలాగే శ్యామ్ సింగ రాయి టాక్ లో తేడా కొడితే.. భారీగా నష్టాలూ వస్తాయని.. శ్యామ్ నిర్మాతలు టెంక్షన్ పడుతున్నారు.