బిగ్ బాస్ సీజన్ 5 చప్పగానో.. లేదంటే నీరసంగానో ఎలాగో ముగిసిపోయింది. గత ఆదివారం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యింది. బిగ్ బాస్ స్టార్ మాలో పూర్తయినా.. బిగ్ బాస్ లో టాప్ 5 కి చేరిన సిరి, శ్రీరామ్, మానస్, అలాగే విన్నర్ గా నిలిచిన సన్నీ యూట్యూబ్ ఛానల్స్ లోను, అలాగే టివి ఛానల్స్ లో ఇంటర్వూస్ తో తెగ హడావిడి చేస్తున్నారు విన్నర్ సన్నీ అయితే దొరికిన ఛానల్ దొరికినట్టుగా కనిపిస్తున్నాడు. ఇక మానస్ తో కలిసి సన్నీ ఏబీఎన్, ఎన్టీవీ, యూట్యూబ్ ఛానల్స్ లో హల్చల్ చేస్తున్నాడు. ఇక మరో టాప్ 5 కంటెస్టెంట్ సిరి కూడా అంతే హడావిడిగానే తిరుగుతుంది. అలాగే శ్రీరామ చంద్ర కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాడు.
కానీ బిగ్ బాస్ సీజన్ 5 రన్నర్ గా నిలిచిన షణ్ముఖ్ జాస్వంత్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చాక కేక్ కటింగ్స్ అంటూ కొద్దిన రచ్చ చేసిన షణ్ముఖ్ తర్వాత యూట్యూబ్ ఛానల్ లో ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వడం లేదు. బిగ్ బాస్ విన్నర్ గా అవుతానని అనుకున్నాడేమో.. రన్నర్ అయ్యేసరికి కాస్త ఫీలైనట్టున్నాడు. అందుకే యూట్యూబ్ ఛానల్స్ లోకి రావడం లేదు అంటున్న కొంతమంది సన్నీ ఫాన్స్. సన్నీ లా ఒక్క టాస్క్ లోనూ షణ్ముఖ్ యాక్టీవ్ గా లేదు.. సిరిని కంట్రోల్ చేసుకుంటూ ఆమెతోనే షో మొత్తం గడిపేశాడు.. ఫ్యాన్ ఫాలోయింగ్స్ భీబత్సంగా ఉంటే మాత్రం.. విన్నర్ అయిపోతారా అనేది ఇప్పుడు షణ్ముఖ్ యాంటీ ఫాన్స్ వేస్తున్న ప్రశ్న.