Advertisementt

పుష్ప కలెక్షన్స్ భారీ దెబ్బ

Thu 23rd Dec 2021 10:57 AM
pushpa,allu arjun,pushpa collections,ap government,100 theaters closed in ap  పుష్ప కలెక్షన్స్ భారీ దెబ్బ
Pushpa Collection is a huge blow పుష్ప కలెక్షన్స్ భారీ దెబ్బ
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప సినిమా గత శుక్రవారమే ఐదు భాషల్లో రిలీజ్ అయ్యి మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. అల్లు అర్జున్ పెరఫార్మెన్స్ తప్ప సినిమాలో ఇంకేమి స్పెషల్ లేదనే టాక్ తోనే మొదటి మూడు రోజులు మంచి కలెక్షన్స్ సాధించిన పుష్ప సినిమాకి సోమవారమే కలెక్షన్స్ లో గండి పడింది. వీక్ డేస్ లో వీక్ కలెక్షన్స్ తెచ్చుకున్న పుష్ప సినిమాకి ఇప్పుడు ఏపీ ప్రభుత్వం మరో షాకిచ్చింది. పుష్ప సినిమా వీక్ డేస్ లో వీక్ కలెక్షన్స్ తో రన్ అవుతుంటే.. ఇప్పుడు అక్కడ ఏపీలో థియేటర్స్ క్లోజ్ చెయ్యడంతో పుష్ప కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావడం పడుతుంది. 

ఏపీ ప్రభుత్వం థియేటర్స్ పై దాడులు నిర్వహించి అక్కడ థియేటర్స్ సీజ్ చేస్తుంది. దానితో కొంతమంది థియేటర్స్ యాజమాన్యాలు స్వచ్ఛందంగా థియేటర్స్ క్లోజ్ చేస్తున్నారు. కొన్ని జిల్లాలో ఏకంగా 50 థియేటర్స్ క్లోజ్ అవడంతో.. ఇప్పుడు ఆ ప్రభావం పుష్ప కలెక్షన్స్ పై పడుతుంది. అసలే సో సో టాక్ తో ఉన్న పుష్ప సినిమాకి ఇప్పుడు ఈ థియేటర్స్ క్లోజ్ అవడం మరింతగా దెబ్బకొట్టినట్లే. ఇప్పటికే టికెట్స్ ఇష్యు తో కలెక్షన్స్ కి గండి పడింది. ఈ పరిస్థితుల్లో ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు కోర్టును ఆశ్రయించడంతో రేట్లు పెంచుకోడానికి పర్మీషన్ ఇచ్చింది కోర్టు. కానీ ఏపీ ప్రభుత్వం సింగిల్ బెంచ్‌ విచారణకు పిటీషన్ వేసింది. ఇప్పుడు థియేటర్స్ క్లోజ్ తో పుష్ప కలెక్షన్స్ కి మరో దెబ్బపడింది.. 

Pushpa Collection is a huge blow:

100 theaters closed in AP 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ