బిగ్ బాస్ సీజన్ 5 టాప్ కి వెళ్లిన షణ్ముఖ్ జాస్వంత్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడని ఆయన ఫాన్స్ గట్టిగా ఓట్లు గుద్దారు. కానీ షణ్ముఖ్ ఇమేజ్ ని సిరి ఫ్రెండ్ షిప్ డ్యామేజ్ చేసింది. అందుకే టైటిల్ విన్నర్ కాలేకపోయాను అంటూ షణ్ముఖ్ బిగ్ బాస్ బజ్ లో చెప్పడం ఆశ్చర్యంగా మారింది. అతిగా ఆలోచించడం, రవి ఎలిమినేట్ అవడం, కాజల్ కి రవి కన్నా ఎక్కువ ఓట్స్ రావడం అనేది నేను జీర్ణించుకోలేకపోయాను. అలాగే సన్నీ నన్ను ఎప్పుడూ నామినేట్ చెయ్యకపోయినా.. సీక్రెట్ నామినేషన్స్ లో నన్ను నామినేట్ చేసాడు.. కారణం ఎమోషనల్ బాండింగ్ లేదు అన్న కారణంగా. హౌస్ లో ఉండాలంటే ఎమోషనల్ బాండింగ్ ఉండాలా అని అడుగుతున్నాడు.
ఇక టాప్ 5 లో క్రేజ్ పరంగా నేను, రవి, సన్నీ, శ్రీరామ్ ఉంటామనుకున్నాం.. ఇక సిరి మదర్ వచ్చి హగ్స్ విషయం మాట్లాడినప్పుడు బాగా ఫీలయ్యాను. సిరి మూలంగానే నేను బిగ్ బాస్ విన్నర్ గా గెలవలేకపోయాను. ఆమె నా ఫ్రెండ్. ఐదేళ్లు దీప్తి సునాయానాతో రిలేషన్ లో ఉన్నాను, దీప్తి పేరు చేతిపై టాటూ వేయించుకున్నాను. అంతలా దీప్తిని ప్రేమించిన నేను సిరితో ఎలా కమిట్ అవుతాను. దీప్తితో నా రిలేషన్‌లో ఎగుడుదిగుడులు ఉన్నాయి. మేమిద్దరం గొడవలు పడితే మూడు, నాలుగు నెలలు మాట్లాడుకోం. కానీ సిరి తో అలాకాదు, ఆమెతో 105 రోజులు కలిసి ఉన్నా. కానీ దీప్తితో నేను ఎప్పుడూ కలిసి ఉండలేదు. అందుకే సిరితో అంతలా బాండింగ్ ఏర్పడింది. మా రిలేషన్ కేవలం ఫ్రెండ్ షిప్ మాత్రమే.
సిరి నేను మంచి ఫ్రెండ్స్ మాత్రమే. సిరి ఫ్రెండ్ షిప్ వలన, కొన్ని చిన్న చిన్న తప్పిదాల వలనే నేను టైటిల్ కోల్పోయాను అంటూ షణ్ముఖ్ జస్వంత్ స్టార్ మా బజ్ లో చెప్పుకొచ్చాడు.