Advertisement
TDP Ads

ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వం పగ

Wed 22nd Dec 2021 10:22 PM
ap government,cinema industry,revenge,tollywood,movie theaters  ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వం పగ
AP government revenge on Tollywood ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వం పగ
Advertisement

సినిమా ఇండస్ట్రీపై ఏపీ ప్రభుత్వం, వైసిపి ప్రభుత్వం పగ బట్టింది. సామాన్యుడైనా, కలిగిన వాడైనా.. తన దగ్గర డబ్బు ఉంటేనే సినిమా టికెట్ కొనుక్కుని సినిమాకి వెళతాడు.. అంతేకాని.. సినిమా టికెట్ ధర ఎక్కువ ఉంది అని ఎవరూ కంప్లైంట్ చెయ్యకపోయినా.. వైసిపి సర్కార్ మాత్రం.. సినిమా టికెట్స్ ని ఇష్టానుసారం పెంచుకుంటే కుదరదంటూ.. ఉన్న రెట్లని తగ్గించేసి.. ఇండస్ట్రీకి షాకిచ్చింది. కోర్టుకి వెళ్ళిన.. ఏపీ ప్రభుత్వం ఊరుకోవడం లేదు. హై కోర్టు తీర్పుని సవాల్ చేస్తుంది. కరోనా పాండమిక్ సిస్ట్యువేషన్ లో సినిమా ఇండస్ట్రీ కుదేలైంది. దానితో ఇండస్ట్రీలో ఇంకా సమస్యలు మొదలయ్యాయి. ఎలాగో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి.. మళ్లీ టాలీవుడ్ కుదురుకుంటుంది అనుకుంటే.. ఏపీ ప్రభుత్వం టికెట్ రేట్ల విషయంలో  పట్టుపట్టుకుని కూర్చుంది.

అలాగే రీసెంట్ గా పెద్ద సినిమాల జాతర మొదలైంది. ఈలోపు ఏపీ విజిలెన్స్ అధికారులు ఏపీ వ్యాప్తంగా థియేటర్స్ పై దాడులు చేస్తూ థియేటర్స్ ని సీజ్ చెయ్యడం చర్చనీయాంశం అయ్యింది. కృష్ణ జిల్లాలో ఏకంగా 14 థియేటర్స్ ని సీజ్ చేసిన అధికారులు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలోనూ దాడుల్ని నిర్వహించి థియేటర్స్ సీజ్ చేసారు. దానితో థియేటర్స్ యాజమాన్యాలు మళ్లీ మీటింగ్ పెట్టి.. ఏపీ ప్రభుత్వం థియేటర్స్ పై ఎందుకిలా కక్ష సాధిస్తుంది, తర్వాత పరిణామాలపై చర్చించనున్నట్లు తెలుస్తుంది. కొన్ని థియేటర్ లలో తినుబండారాలు అధిక ధరలకు అమ్ముతున్నారని.. కొన్ని థియేటర్స్ లో సరైన వసతులు లేవు అంటూ అధికారులు సినిమా థియేటర్స్ ఫై కొరడా ఝుళిపించడం చూస్తే సినిమా ఇండస్ట్రీ పై వైసిపి సర్కార్ పగ పట్టింది అనే చెప్పాలి. 

AP government revenge on Tollywood:

YCP government revenge on Cinema Industry

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement