యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొన్ని రోజులుగా ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో రామ్ చరణ్ తో కలిసి యాక్టీవ్ గా అదరగొట్టేస్తున్నాడు. మీడియా వాళ్ళే కాదు.. ఫాన్స్ అంతా తన వైపే చూసేలా ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో ఫన్ జనరేట్ చేస్తున్నాడు. ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్ చరణ్ - ఎన్టీఆర్ కలిసి జక్కన్నతో ఉన్న అన్యోన్యతని చూపించడమే కాదు.. సల్మాన్ ఖాన్, కరణ్ జోహార్ లకి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చారు. ఇక ప్రెజెంట్ పలు నేషనల్ ఛానల్స్ కి రామ్ చరణ్ - ఎన్టీఆర్ లు ఇంటర్వ్యూలు ఇస్తూ ఆర్.ఆర్.ఆర్ పై అంచనాలు అంతకంతకు పెంచేస్తున్నారు.
ఇక ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్ ఇంటర్వూస్ లో ఆయన బాలీవుడ్ ఎంట్రీ పై ప్రశ్నలు ఎదురవుతున్నాయి. ఎన్టీఆర్ కూడా తన బాలీవుడ్ ఎంట్రీ పై క్లియర్ కట్ ఆన్సర్ ఇచ్చేసాడు. హిందీలో ఎప్పుడు నటిస్తారని ఎన్టీఆర్ ని అడగ్గానే.. తాను కూడా బాలీవుడ్ ఆఫర్స్ కోసం వెయిట్ చేస్తున్నట్టుగా చెప్పాడు. ఆర్.ఆర్.ఆర్ తర్వాత తనకొచ్చిన క్రేజ్ తో ఏమైనా అవకాశాలొస్తాయేమో చూడాలి అంటూ ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ పై అందరిలో క్యూరియాసిటీ కలగజేసాడు. మరి ఆర్.ఆర్.ఆర్ లో ఎన్టీఆర్ నటనకు మంచి మార్కులు పడితే అతన్ని వెతుకుంటూ బాలీవుడ్ దర్శకులు వస్తారో.. లేదంటే తెలుగు డైరెక్టర్స్ తోనే బాలీవుడ్ ఎంట్రీ ఇస్తాడో చూడాలి. ఇంతకుముందే ఎన్టీఆర్ తో బాలీవుడ్ బడా దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ మూవీ చేయబోతున్నట్లుగా ప్రచారం జరిగింది. ఆ విషయమై ఎన్టీఆర్ పెదవి విప్పలేదు.