నాని శ్యామ్ సింఘా రాయ్ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఇది నాని కెరీర్ లో బడ్జెట్ పరంగా చాలా పెద్ద సినిమా. నాలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతోంది కూడా. యాక్టర్ గా తనకి ఈ శ్యామ్ సింఘా రాయ్ అనేది కెరిర్ లో బెస్ట్ గా కూడా ఉంటుంది అంటున్నారు నాని. నాకు చాలా సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది అందుకే ఇప్పటి వరకు చేసిన దానిలో ఇది నాకు బెస్ట్ అని చెప్పొచ్చు అన్నారు. ఇది భారీ బడ్జెట్ పరంగా కూడా నాని మొదటి సినిమా.
అయితే నాని ఏమంటారు అంటే తన సినిమాలు అన్ని తన కెరిర్ లో బిగ్గెస్ట్ సినిమాలు అంటారు. మొదటి సినిమా అష్ట చెమ్మ తో పోలిస్తే తాను చేసిన ప్రతి సినిమా బడ్జెట్ పెరుగుతోంది అని, అలాగే అంచనాలు కూడా పెరుగుతున్నాయని అంటున్నారు. ప్రతి సినిమా కి తాను బాగా కష్ట పడతానని, కానీ ఈ సినిమాకి వచ్చేసరికి మొదటి సారిగా నాలుగు భాషల్లో రిలీజ్ అవుతోంది కాబట్టి, కొంచెం ఎక్కువ ప్రమోషన్స్ చేసాము అని అన్నారు. అయితే ఈ సినిమాకి తాను చాలా కాన్ఫిడెంట్ గా వున్నాను అని అన్నారు. నేను జెర్సీ సినిమాకి కూడా ఇంతే కాన్ఫిడెంట్ గా మాట్లాడాను, మళ్ళీ ఈ శ్యామ్ సింఘా రాయ్ కి కూడా అంతే కాన్ఫిడెంట్ గా మాట్లాడుతున్నా అంటూ నాని శ్యామ్ సింగ రాయ్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.