తెలుగు యాక్టీవ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఈరోజు సమావేశం పెట్టి కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ ఆర్ ఆర్ ఆర్ మరియు రాధే శ్యామ్ సినిమాలతో క్లాష్ అవుతున్నాయని చెప్పి కొంచెం ముందుకు జరిపారు చెపాప్రు. అలా జరిగిన వాటిల్లో పవన్ కళ్యాణ్ సినిమా భీమ్లా నాయక్ వుంది. అయితే ఇక్కడ అందరి భయం రిలీజ్ డేట్స్ కాదు అని స్పష్టం అవుతోంది. ఎందుకంటే ఈ రిలీజ్ డేట్స్ అన్ని ఎప్పుడో ప్రకటించారు, ఈరోజు కొత్తగా ఏమి చెప్పలేదు. అదీ కాకుండా ఎప్పుడూ సంక్రాంతికి నాలుగు అయిదు పెద్ద సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి.
కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ డేట్ వెనక్కి జరపడం తో ఆ నిర్మాతలు బయటకి ఒప్పుకున్నా, లోపల మాత్రం చాలా తిట్టుకుంటూ భయంగానే వున్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో అదేదో కొత్త వైరస్ ఒకటి వస్తోంది, మళ్ళీ లాక్ డౌన్ దిశగా అన్ని రంగాలు వెళ్లొచ్చు అన్న భయం. అందుకే కదా, పుష్ప సినిమా టెక్నికల్ గా సరిగా లేకపోయినా, ఆదరా బాదరా విడుదల చేసారు. దర్శకుడు సుకుమార్ కూడా ఒక మీడియా సమావేశం లో ఆ విషయం ఒప్పుకున్నారు కూడా. ఇప్పుడు ఈ పెద్ద సినిమాల నిర్మాతలకి కూడా అదే భయం పట్టుకుంది అని ఇండస్ట్రీ లో టాక్. ఒకవేళ మళ్ళీ లాక్ డౌన్ అంటే ఈ పెద్ద సినిమా నిర్మాతలు ఇప్పటికే చాలా ఖర్చు పెట్టి, కష్ట పడి ఈ సినిమాలన్నీ కంప్లీట్ చేసారు. మరి లాక్ డౌన్ అంటే, అంతా మళ్ళీ మొదటికే. అందుకనే అందరూ వెంట వెంటనే రిలీజ్ చెయ్యాలని తహ తహ లాడారు. ఆ వైరస్ రాకుండా, లాక్ డౌన్ లేకుండా ఉంటే మాత్రం అందరికి సంతోషమే.