సాయి పల్లవి చెల్లెలు కూడా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంటర్ అవుతోంది. ఇదే విషయం శ్యామ్ సింగ రాయ్ ప్రమోషన్స్ లో ఉన్న సాయి పల్లవి ని అడిగితే తనకి కూడా చాలా లేట్ గా తెలిసింది ఈ విషయం అంటోంది. తనతో పాటు విరాట పర్వం షూటింగ్ కి చెల్లెలు పూజ ని తీసుకు వచ్చిందట సాయి పల్లవి. అలా షూటింగ్ టైం లో ఎవరో ఆమెని నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా అని అడిగితే.. దానికి సాయి పల్లవి చెల్లెలు 'వూ' అందట. ఇంకేమి, సదరు వ్యక్తి వెంటనే ఓహో అంటూ.. సాయి పల్లవి సిస్టర్ కూడా హీరోయిన్ అవుతుందట అని అందరికి ఆ విషయం చెప్పేశాడట.
ఆ తరువాత ఇంటికి వచ్చిన కొన్ని రోజుల తరువాత సాయి పల్లవి కి తెలిసిందిట తన చెల్లెలు కూడా యాక్టింగ్ చెయ్యాలని అనుకుంటోందని. అయినా తనకి తన చెల్లెలు ఏమి కాంపిటీషన్ కాదు అంటోంది. తన ఇష్టాలు వేరు మరియు తనకి నచ్చిన స్క్రిప్ట్స్ తాను సెలెక్ట్ చేసుకుంటుంది. ఆమె కూడా తన లానే ఒక ఇండివిడ్యుయల్ వుమన్, ఆమెకి చాల నాలెడ్జి వుంది అని చెప్తోంది సాయి పల్లవి. నా చెల్లెలు సాయి పల్లవి చెల్లెలు లా కాకుండా పూజ గానే అందరికి తెలియాలి అని అనుకుంటోందని చెప్పింది సాయి పల్లవి.