బిగ్ బాస్ సీజన్ 5 ముగిసినా.. బిగ్ బాస్ సీజన్ 5 టాప్ 5 కంటెస్టెంట్స్ హడావిడి ఇంకా తగ్గలేదు. టాప్ 5లో ఉన్న మానస్, షణ్ముఖ్, శ్రీరామ్ లు సైలెంట్ గానే కనిపిస్తున్నారు కానీ.. విన్నర్ సన్నీ, టాప్ 5 లేడీ కంటెస్టెంట్ సిరి మాత్రం పలు ఛానల్స్ లో ఇంటర్వ్యూ లు అంటూ హడావిడి చేస్తున్నారు.. కప్ గురించి , బిగ్ బాస్ గురించి సన్నీ ఇంటర్వూస్ లో పంచుకుంటుంటే.. సిరి కి మాత్రం షణ్ముఖ్ తో హగ్గులు, కిస్సుల విషయంలో ప్రతి ఇంటర్వ్యూలో ప్రశ్నలు ఎదురవుతున్నాయి. బిగ్ బాస్ హౌస్ లో ఎన్నడూ లేని విధంగా హగ్గులు, కిస్సులతో రెచ్చిపోయిన సిరి, షణ్ముఖ్ లు బయట బాగా నెగెటివిటి మూటగట్టుకున్నారు. అందుకే షణ్ముఖ్ సైలెంట్ గా ఇంటికెళ్ళిపోగా.. సిరి మాత్రం ఛానల్ ఇంటర్వూస్ ఈ హగ్గులు, ముద్దుల విషయంలో అడ్డంగా దొరికిపోతుంది.
హౌస్ లో ఎలాంటి సిగ్గు, బెరుకు లేకుండానే హగ్గులతో చెలరేగిపోయిన సిరికి బయట ఇంటర్వూస్ లో ఆ హగ్గులు విషయం అడగడం నచ్చడం లేదు.. ఓ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో సిరి ని షణ్ముఖ్ తో ఈ హగ్గులు, ముద్దులు లేకపోతె.. మీరు ఇంకాస్త బెటర్ గా పెరఫార్మ్ చేసేవారేమో అని అడగ్గానే మీరు ఇవన్నీ అడగానంటేనే నేను ఇంటర్వ్యూ కి వచ్చాను అంటూ సిరి మధ్యలో ఆ ఇంటర్వ్యూ నుండి లేచి వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది. నేను షణ్ముఖ్ తో నిజమైన ఫ్రెండ్ షిప్ చేశాను.. హౌస్ లోనే కాదు బయట కూడా మేము మంచి ఫ్రెండ్స్. మా హగ్గులు, కిస్ ల విషయం బయట చాలా నెగెటివ్ గా వెళ్ళింది అని నాకొచ్చిన కామెంట్స్ చూస్తే అర్ధమైంది. మా అమ్మ వచ్చి ఆ విషయం చెప్పినప్పుడు గనక నేను హగ్స్ ఇవ్వకపోతే నేను తప్పు చేశాను అని ఫీలైనట్టే. కానీ అలా చెయ్యలేదు మమ్మి చెప్పాక కూడా నేను అలానే ఉన్నాను.. అంటూ తనని తాను సమర్ధించుకుంది సిరి.