పుష్ప సినిమా హిట్ అయి అల్లు అర్జున్ కి, దర్శకుడు సుకుమార్ కి మంచి పేరు తెచ్చి పెట్టింది. అయితే ఇందులో కథ నాయికగా నటించిన రష్మిక మందన్న కూడా చాలా సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని చాలా ఇంటర్వూస్ ఇచ్చింది. అల్లు అర్జున్ సైతం రష్మిక పనిని బాగా మెచ్చుకున్నారు. కానీ ఏమి లాభం, రష్మిక కి ఆశించినంత పేరు రాలేదని చాలా బాధపడిపోతోంది. ఈ సినిమా లో ఒక ఐటెం సాంగ్ చేసిన సమంత మొత్తం పేరు ఎగరేసుకు పోయింది.
సినిమా చూసిన ప్రతివాళ్ళు సమంత గురించి మాట్లాడుకుంటున్నారు తప్పితే, రష్మిక గురించి ఎవరు చెప్పటం లేదు. ఇంకా సోషల్ మీడియా లో అయితే సమంతానే అందరూ మెచ్చుకుంటున్నారు. దర్శకుడు సుకుమార్ భార్య కూడా సమంతని మెచ్చుకుంటూ ఒక పెద్ద పోస్ట్ కూడా పెట్టారు. ఆ సాంగ్ కూడా చాలా పాపులర్ అయిపొయింది. పాపం.. ఇలా రష్మిక క్రెడిట్ అంతా సమంతకే వచ్చింది. ఇప్పుడు రష్మిక ఈ సినిమా రెండో పార్ట్ కోసం వేచి చూస్తోంది. అందులో అయిన తన రోల్ కొంచెం బాగా ఉంటుందని ఆశ పడుతోందిట.