బాలకృష్ణ అన్ స్టాపబుల్ అంటూ ఆహా ఓటిటీ కోసం చేస్తున్న టాక్ షో... ఎపిసోడ్ ఎపిసోడ్ కి లెక్కలు మారిపోతున్నాయ్. బాలకృష్ణ అతిధులతో ఆటాడించడమే కాదు.. తనలోని మరో చిలిపి కోణాన్ని బయటికి తీస్తున్నారు. బాలకృష్ణ అంటే చిన్న పిల్లల మనస్తత్వం.. అలాంటి బాలయ్య స్టార్స్ తో అన్ స్టాపబుల్ అట ఆడించడం ఇంట్రెస్టింగ్ గా కాదు కొత్తగా అనిపిస్తుంది. ఇంతవరకు వచ్చిన టాక్ షోస్ ఒక ఎత్తు.. ఆహా ఓటిటిలో వస్తున్న అన్ స్టాపబుల్ టాక్ షో ఓక్ ఎత్తు అనేలా ఉంది బాలయ్య హోస్ట్ చేస్తున్న ఈ షో. మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అఖండ టీం, ఆర్.ఆర్.ఆర్ జక్కన్నలతో అన్ స్టాపబుల్ అంటూ అదరగొట్టిన బాలయ్య తర్వాత రవితేజతో చేసాడు.
అంతకన్నా ముందే అల్లు అర్జున్ తో అన్ స్టాపబుల్ ఎపిసోడ్ క్రిష్ట్మస్ స్పెషల్ గా రాబోతుంది. తర్వాత డిసెంబర్ 31న రవితేజ ఎపిసోడ్ కి సంబందించిన ప్రోమో వదిలారు మేకర్స్. ఆ ప్రోమోలో బాలయ్య అల్లరి, రవితేజ జోరు మాములుగా లేదు. బాలయ్య మాస్ మహారాజ్ రవితేజ అంటూ ఆహ్వానించగానే యాక్టీవ్ గా స్టేజ్ పైకి వచ్చిన రవితేజ తో ఏంటి మనిద్దరికీ గొడవలు జరిగాయని, కొట్టేసుకున్నామని బయట టాక్ అని బాలయ్య అనగానే అవును.. పని పాట లేని డాష్ డాష్ గాళ్ళు రాస్తుంటారు.. అవన్నీ ఉత్తుత్తే అంటూ ఫన్ చేసాడు రవితేజ. ఏంటి మొగల్రాజ పురంలో అమ్మాయిలకి సైట్ కొడుతుండేవాడివటఅని బాలయ్య అడగగా.. ఇవన్నీ మీకెలా తెలుసండి బాబు అన్నాడు రవితేజ.. నేనూ నీ వయసులో అమ్మాయిలకి సైట్ కొట్టేవాడిని.. చుట్టాలింటికి అని చెప్పి అక్కడ అమ్మాయిలకి బీట్ వేసేవాడిని.. బైక్ పై అంటూ నేను కృష్ణాజిల్లా వాడినే అంటూ రవితేజ తో కామెడీ చేసారు బాలయ్య.
అంతేకాకుండా రవితేజ ని బాలకృష్ణ రవితేజ కెరీర్ లోనే బ్యాడ్ ఇన్సిడెంట్ గా నిలిచిన డ్రగ్స్ కేసు వ్యవహారం అడగడం హాట్ టాపిక్ అయ్యింది.
తర్వాత NBK107 డైరెక్టర్ గోపీచంద్ మలినేనిని పిలిచి రవితేజతో రెండు బ్లాక్ బస్టర్స్ చేసావ్.. మన సినిమా బ్లాక్ బస్టర్ అవ్వకపోతే నీకు అంటూ పొట్టలో గుద్దారు బాలయ్య. ఇక సమర సింహారెడ్డి టైం లో అరెస్ట్ అయ్యి పోలీస్ లతో దెబ్బలు తిన్న ముచ్చట గోపీచంద్ మలినేని చెప్పగా.. రవితేజ మాత్రం బాలయ్య అఖండ మూవీలోని జై బాలయ్య సాంగ్ కి అన్ స్టాపబుల్ స్టేజ్ పై స్టెప్స్ వెయ్యడం నిజంగా ఈ ఎపిసోడ్ కే హైలెట్ అనేలా ఉంది.