సితార ఎంటర్ టైన్మెంట్ నిర్మాతలు పవన్ కళ్యాణ్ కథా నాయకుడిగా భీమ్లా నాయక్ తో పాటు ఇంకా మరికొన్ని చిన్న సినిమాలు కూడా తీస్తున్నారు. కొన్ని చివరి దశలో ఉండగా, మరికొన్ని ఇంకా షూటింగ్స్ దశలో లో వున్నాయి. అయితే ఇప్పుడు సితార వాళ్ళకి సమస్య ఏంటంటే, వాళ్ళు వున్నదంతా భీమ్లా నాయక్ కే ఖర్చు పెట్టేస్తున్నారు. భీమ్లా నాయక్ సినిమాలో కొన్ని సీన్స్ రి-షూట్ కూడా చేసారు. అందుకని భీమ్లా నాయక్ నిర్మాతలు ఆ సినిమా మీదే ఎక్కువ ఫోకస్ పెట్టి చేస్తున్నారు. పెద్ద యాక్టర్, పెద్ద సినిమా, దానికి తోడు త్రివిక్రమ్ లాంటి పెద్ద డైరెక్టర్ కూడా ఆ సినిమా కి వర్క్ చెయ్యడం తో ఆ సినిమా మీదే మొత్తం కాన్సంట్రేషన్ వుంది.
అందుకని భీమ్లా నాయక్ మేకర్స్ తాము నిర్మిస్తున్న మిగతా చిన్న సినిమాలని సరిగ్గా పట్టించుకోటం లేదని తెలుస్తుంది. ఎందుకంటే చిన్న సినిమాల్లో నటిస్తున్న ఆర్టిస్ట్ లకు రెమ్యూనరేషన్ పెండింగ్ లో పెట్టారని తెలుస్తుంది. ఒక్క మెయిన్ లీడ్ కి తప్పితే మిగతా అందరి ఆర్టిస్ట్స్ కి రోజు వారి రెమ్యూనరేషన్ ఇస్తారు. ఇక్కడ సితార వాళ్ళు చిన్న సినిమాల్లో చేసిన ఆర్టిస్ట్స్ అందరికి రెమ్యూనరేషన్ పెండింగ్ పెట్టారట. మనీ అంతా భీమ్లా నాయక్ లో పెట్టాం, మనీ స్టాగ్నెట్ అయిపొయింది అంటున్నారట. భీమ్లా నాయక్ రిలీజ్ ఇప్పుడు సంక్రాంతి నుండి ఫిబ్రవరికి షిఫ్ట్ అయ్యింది. ఇప్పడు ఆ సినిమాకి రావాల్సిన అడ్వాన్స్ మనీ కొంచెం లేట్ అవుతోందని.. అందుకనే మిగతా చిన్న సినిమాలకి ఇవ్వాల్సిన పెమెంట్స్ ఆగాయి అని తెలుస్తుంది.