బిగ్ బాస్ సీజన్ 5 లోకి టైటిల్ ఫెవరెట్ గా అడుగుపెట్టిన యూట్యూబర్, షార్ట్ ఫిలిం హీరో షణ్ముఖ్ జాస్వంత్.. బిగ్ బాస్ హౌస్ లో మొదటి ఆరేడు వారాలు కేవలం మోజ్ రూమ్ కే పరిమితమై టాస్క్ లలో చాలా వీక్ పెరఫార్మెన్స్ తో.. జెస్సి, సిరి ల ఫ్రెండ్ షిప్ తో నెట్టేశాడు. షణ్ముఖ్ కి అసలే యాటిట్యూడ్ ఎక్కువ. నాకు 4 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.. నాకెలాగూ విన్నర్ గా బిగ్ బాస్ సీజన్ 5 ట్రోఫీ వచ్చేస్తుంది అనుకున్నాడు. కానీ షణ్ముఖ్ జస్వంత్ కి ఫాన్స్ కూడా షాకిచ్చారు. షణ్ముఖ్ సిరి తో చేసే ఓవేరేక్షన్ భరించలేకపోయారు బుల్లితెర ప్రేక్షకులు. టాస్క్ ల పరంగా వీక్, యాటిట్యూడ్, సిరి తో అతి ఫ్రెండ్ షిప్, సిరి మీద అరవడం, వేరే కంటెస్టెంట్స్ తో కలవకపోవడం.. అబ్బో షణ్ముఖ్ క్రేజ్ మొత్తం బిగ్ బాస్ గంగలో కలిపేసింది.
అసలు సిరితో హగ్గులు, కిస్ లు మాములుగాలేదు యవ్వారం. ఒకొనొక టైం లో షన్ను - సిరి ప్రవర్తనకు బిగ్ బాస్ ప్రేక్షకులకే చిరాకు వేసింది. మరి బిగ్ బాస్ లోకి యూట్యూబర్ గా క్రేజీ కంటెస్టెంట్ గా అడుగుపట్టిన షణ్ముఖ్ అతనికున్న క్రేజ్, రేంజ్ దృష్ట్యా బిగ్ బాస్ అతనికి భారీ పారితోషకమే ఫిక్స్ చేసింది. షణ్ముఖ్ కి వారానికి నాలుగు నుండి ఐదు లక్షల దాక స్టార్ మా పే చేసినట్టుగా టాక్. మొత్తంగా షణ్ముఖ్ బిగ్ బాస్ లో ఉన్న 15 వారాలకు గాను.. ఏకంగా 60 లక్షల పారితోషకం అందుకున్నాడని, విన్నర్ సన్నీ కన్నా కొద్దిగా అటు ఇటుగా షణ్ముఖ్ పారితోషకం ఉంది అని అంటున్నారు. మరి విన్నర్ అవ్వకపోయినా, దానికున్న యాటిట్యూడ్ తో షణ్ముఖ్ బిగ్ బాస్ ద్వారా చాలానే సంపాదించాడు సుమీ..