Advertisementt

ఫాన్స్ రచ్చ.. ఎన్టీఆర్ ఆగ్రహం

Tue 21st Dec 2021 12:30 PM
mumbai,rrr pre release event,jr ntr,ntr warning to fans,ram chran fans,ntr fans  ఫాన్స్ రచ్చ.. ఎన్టీఆర్ ఆగ్రహం
Jr NTR Warning to Fans ఫాన్స్ రచ్చ.. ఎన్టీఆర్ ఆగ్రహం
Advertisement
Ads by CJ

ఇండియా వైడ్ గా ఆర్.ఆర్.ఆర్ మ్యానియా ఏ రేంజ్ లో ఉందో.. ముంబై ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చూపించారు ఫాన్స్. విడివిడిగానే రెచ్చిపోయే ఫాన్స్.. ఇప్పుడు స్టార్ హీరోలైన రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి కనబడితే ఆగుతారా.. ఫాన్స్ కూడా కలిసిపోయి రచ్చ రచ్చ చెయ్యరు. ఆ రచ్చ విధంగా ఉంటుందో అనేది ముంబై ఆర్.ఆర్.ఆర్  ఈవెంట్ లోనే కనబడింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ కలయికలో వస్తున్న, రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముంబైలో బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ గా జరిగింది. ఆ ఈవెంట్ లైవ్ ఇవ్వకపోవడంతో కొద్దిగా ప్రేక్షకులు డిస్పాయింట్ అయినా.. అక్కడ ఈవెంట్ కి వచ్చిన ఫాన్స్ రచ్చ, గోల అంతా ఇంతా కాదు.. జై ఎన్టీఆర్,  జై చరణ్ అంటూ బారికేడ్లు ఎక్కేసి నానా యాగీ చేసారు. అటు ఎన్టీఆర్ ఫాన్స్, ఇటు రామ్ చరణ్ ఇద్దరు ఫాన్స్ ఆ ఈవెంట్ లో గోల గోల చేసేసారు.

బారికేడ్ల‌ను దాటి కొంతమంది ఫాన్స్ లోప‌లికి రావ‌డానికి ప్ర‌య‌త్నించడంతో.. ఎన్టీఆర్ కాస్త ఆగ్రహించారు. స్టేజ్ పై కరణ్ జోహార్ మాట్లాతుండగా.. ఫాన్స్ గోలకి, బారికేడ్లు ఎక్కుతున్న ఫాన్స్ ని కంట్రోల్ చేసేందుకు ఎన్టీఆర్ మైక్ అందుకుని.. ఇది ప‌ద్ధ‌తిగా లేదు.. అంద‌రూ కింద‌కు దిగుతారా లేదా.. కింద‌కు దిగండి.. ఆగండి. అంటూ వార్నింగ్ ఇచ్చినా ఫాన్స్ గోల ఆగలేదు.. దానితో స్టేజ్ పైనే ఉన్న కరణ్ జోహార్.. ఫాన్స్ వాళ్ళు, వాళ్ళని ఆపడం సాధ్యం కాదు అంటూ ఫన్ చేసిన వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. 

Jr NTR Warning to Fans:

Mumbai RRR Pre Release Event: Jr NTR Warning to Fans

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ