Advertisementt

భీమ్లా నాయక్ పై మరోసారి..

Tue 21st Dec 2021 10:48 AM
pawan kalyan,bheemla nayak,rana,sagar k chandra,sithara entertainment,naga vamshi,bheemla nayak makers,bheemla naik  భీమ్లా నాయక్ పై మరోసారి..
Bheemla Nayak Release date change భీమ్లా నాయక్ పై మరోసారి..
Advertisement
Ads by CJ

పవన్ కళ్యాణ్ చేస్తున్న క్రేజీ రీమేక్.. భీమ్లా నాయక్ పై అంచనాలు కన్నా.. ఆ సినిమా సంక్రాంతి బరి నుండి ఎక్కడ తప్పుకుంటుందో అనే టెంక్షన్ లోనే పవన్ ఫాన్స్ గడిపేస్తున్నారు. ఎప్పటికప్పుడు భీమ్లా నాయక్ మేకర్స్ జనవరి 12 నే భీమ్లా నాయక్ రిలీజ్ అంటున్నప్పటికీ.. మళ్ళీ మళ్ళీ రూమర్స్ సోషల్ మీడియాని కమ్మేస్తున్నాయి. ఎందుకంటే సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న సినిమాల ప్రమోషన్స్ జోరు చూసిన పవన్ ఫాన్స్ లోను అనుమానాలు మొదలైపోయాయి. భీమ్లా నాయక్ కన్నా ముందు రాబోతున్న ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ తో రాజమౌళి ఫాన్స్ కి ప్రేక్షకులకి ట్రీట్స్ మీద ట్రీట్స్ ఇస్తున్నారు. మరోపక్క జనవరి 14 న సంక్రాంతికి టార్గెట్ గా రాబోతున్న ప్రభాస్ రాధేశ్యామ్ ప్రమోషన్స్ పరుగులు పెడుతున్నా.. భీమ్లా నాయక్ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ విషయంలో స్లో గా ఉన్నారు. 

దానితో ఫాన్స్ కి, ఇటు సోషల్ మీడియా కి కూడా భీమ్లా నాయక్ రిలీజ్ పై అంతకంతకు అనుమానాలు మొదలైపోయాయి. కొని ప్రముఖ వెబ్ సైట్స్ లో భీమ్లా నాయక్ సంక్రాంతి రేస్ నుండి తప్పుకుంటుంది.. ఆర్.ఆర్.ఆర్, రాధేశ్యామ్, బంగార్రాజు ఇన్.. భీమ్లా నాయక్ అవుట్ అంటూ వార్తలు రాసేస్తున్నాయి. మరి ఇలాంటి వారాలొచ్చినప్పుడు భీమ్లా నాయక్ మేకర్స్ లైన్ లోకొచ్చి సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇస్తున్నారు. తాజాగా భీమ్లా నాయక్ సంక్రాతి బరి నుండి తప్పుకుంది, కొత్త రిలీజ్ డేట్ ఫిబ్రవరి 25... భీమ్లా నాయక్ మేకర్స్ ఈ కొత్త డేట్ ని ఈ రోజు అంటే డిసెంబర్ 21న ప్రకటించే అవకాశం ఉంది అంటూ వార్తలు రాసేస్తున్నాయి. మరి నిజంగానే భీమ్లా నాయక్ డేట్ మారబోతుందా? మరి మేకర్స్ ఏమంటారో? చూద్దాం.

Bheemla Nayak Release date change :

Pawan Kalyan Bheemla Nayak New Release Date Is Here!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ