బాహుబలి సినిమా తో ప్రభాస్ నేషనల్ స్టార్ అయిపోయాడు. అదేమీ అతను ప్రయత్నం చేస్తే రాలేదు, ఆ సినిమాతో అతనికి ఒక్కసారిగా రెకగ్నిషన్ వచ్చింది. అయితే ప్రభాస్ ఎప్పుడూ తనో పెద్ద స్టార్ అన్న విషయం ఎక్కడా చూపించలేదు, అలా బాజా కూడా కొట్టుకోలేదు. తనకు వచ్చిన రెకగ్నిషన్ ని తన తదుపరి సినిమా అయిన సాహో కి వాడుకున్నాడు. అది కూడా హిందీ లో పెద్ద హిట్ అయింది. తెలుగు లో సరిగ్గా నడవలేదు అని అంటారు కానీ, ఆ సినిమా కూడా ప్రభాస్ కి మంచి పేరు తీసుకొచ్చింది. నేషనల్ స్టార్ గా.. కష్టపడితే రెకగ్నిషన్ వస్తుంది అని నమ్మే వ్యక్తి ప్రభాస్. అంతే కాని దానికోసమే అతను సినిమా చెయ్యలేదు. బాహుబలి కోసం ప్రభాస్ ఎంత కష్టపడ్డారో అందరికి తెలుసు. అందుకే అతను అంత పెద్ద స్టార్ అయ్యాడు.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కి సడన్ గా నేషనల్ స్టార్ అయిపోవాలని అనుకుంటున్నారు ప్రభాస్ లా. అందుకే తన పుష్ప సినిమా ని ఒక్కడే భుజాన వేసుకొని మరీ మోస్తున్నాడు. సినిమా ప్రచారం లో భాగంగా అల్లు అర్జున్ ఒక్కడే అన్ని భాషలకి వెళ్లి ప్రచారం చేస్తున్నారు, మిగతా టీం మెంబెర్స్ అందరిని పక్కన పెట్టి మరీ. మొదట పుష్ప ని పాన్ ఇండియా అనుకోలేదు, స్టార్ట్ చేసాక అనుకున్నాం అని ఎన్ని కథలు చెప్పినా.. అల్లు అర్జున్ కి మాత్రం ప్రభాస్ లా సడన్ గా నేషనల్ స్టార్ అయిపోవాలన్న కోరిక మాత్రం పోలేదు. దీనికి తోడు, తన సహచర నటులు రామ్ చరణ్, జూనియర్ ఎన్ టి ఆర్ లు కూడా నేషనల్ నటులుగా వచ్చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ సినిమాతో.
అందుకని, అల్లు అర్జున్ సుకుమార్ పోస్ట్ ప్రొడక్షన్ కి టైం ఇవ్వకుండానే డిసెంబర్ పదిహేడు డేట్ ఫిక్స్ చేసి మరీ ఆదరా బాదరా గా తన పుష్ప రిలీజ్ చేయించాడు. అందుకే ఇతర భాషల్లో ఆ సినిమా కొన్ని ప్రదేశాల్లో టైం కి రిలీజ్ కాలేదు. టైం కి రిలీజ్ కాలేదు అన్న విషయం నిర్మాతలే ఒప్పుకున్నారు కదా. మా సినిమాకి బదులు స్పైడర్ మాన్ వేశారు అని. ఇంతకీ చెప్పేది ఏమిటంటే అతను పెద్ద స్టార్ అయిపోయాడు నేను కూడా అతనిలా అయిపోతే అంటే అవదు. హార్డ్ వర్క్ చేస్తే ఆ సినిమానే మిమ్మలి ఎక్కడికో తీసుకెళుతుంది.