Advertisementt

పుష్ప లో ఒక్క సీన్ కూడా కట్ చెయ్యలేదు

Mon 20th Dec 2021 06:21 PM
pushpa,sukumar,mythry movie makers,allu arjun,rashmika mandanna  పుష్ప లో ఒక్క సీన్ కూడా కట్ చెయ్యలేదు
Not a single scene in the Pushpa was cut పుష్ప లో ఒక్క సీన్ కూడా కట్ చెయ్యలేదు
Advertisement
Ads by CJ

అల్లు అర్జున్ మరియు సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన పుష్ప నాలుగో రోజు కూడా బాగా పోతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నిడివి తగ్గించటం కోసం ఒక సీన్ తీసేశారని కొన్ని మాధ్యమాల్లో వార్త చక్కర్లు కొడుతోంది. కొంతమంది మహిళలు అభ్యంతరాలు లేవదీశారని, అలాగే కుటుంబ సభ్యులతో ఆ సీన్ చూడటం ఇబ్బందికరంగా ఉందని ఆ సీన్ తీసేశారని అంటున్నారు. అయితే సోమవారం పుష్ప ప్రెస్ మీట్ లో ఇదే విషయం ఆ చిత్ర నిర్మాతలని అడిగినప్పుడు వారు అటువంటింది ఏమి లేదని చెప్పారు. 

అయితే పుష్ప సినిమాలో ఒక్క సీన్ కూడా కట్ చెయ్యలేదు అన్ని అలాగే ఉంచాం అని చెప్పారు. కొన్ని థియటర్లో ఎదో టెక్నికల్ సమస్యలు వచ్చాయని వాటిని మాత్రం వెంటనే పరిష్కరించాం అని చెప్పారు. అంతే కానీ సీన్స్ కట్ చెయ్యమని ఎవరు అడగలేదు, చెయ్యలేదు అని చెప్పారు. అల్లు అర్జున్ మరియు రష్మిక మందన్నల రొమాంటిక్ సీన్ ఒకటి కార్ లో వుంది అందులో అల్లు అర్జున్ని రష్మిక నీ చెయ్యి ఎక్కడుందో చూడు సామీ అంటుంది. అది కొంచెం నిడివి ఎక్కువసేపు వున్న సీన్.

Not a single scene in the Pushpa was cut:

Pushpa: Scene Showing Allu Arjun Touching Rashmika

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ