Advertisementt

బిగ్ బాస్ ప్రేక్షకులకి గుడ్ న్యూస్

Mon 20th Dec 2021 03:31 PM
nagarjuna,big boss telugu,bigg boss,big boss telugu season 6,big boss news  బిగ్ బాస్ ప్రేక్షకులకి గుడ్ న్యూస్
Good news for the Bigg Boss audience బిగ్ బాస్ ప్రేక్షకులకి గుడ్ న్యూస్
Advertisement
Ads by CJ

నిన్న డిసెంబర్ 19 తో బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా స్టార్ మా లో ముగించేశారు. గత ఐదు సీజన్స్ గా ఆగష్టు, సెప్టెంబర్ లలో మొదలు పెట్టి.. నవంబర్, డిసెంబర్ లలో బిగ్ బాస్ సీజన్స్ ని ముగిస్తున్నారు. మొదటి సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ చెయ్యగా, రెండో సీజన్ కి నాని.. తర్వాత మూడు, నాలుగు, ఐదు సీజన్స్ ని నాగార్జున సక్సెస్ ఫుల్ హోస్ట్ గా నడిపిస్తున్నారు. ఇక మొదటి సీజన్ లో శివ బాలాజీ విన్నర్ అవగా, సెకండ్ సీజన్ లో కౌశల్ విన్ అయ్యాడు. తర్వాత సీజన్ లో రాహుల్ సిప్లిగంజ్, నాలుగో సీజన్ ఓ అభిజిత్ బిగ్ బాస్ విన్నర్స్ గా నిలిచారు. ఇక రీసెంట్ గా ముగిసిన బిగ్ బాస్ సీజన్ 5 కి వీజే సన్నీ విన్నర్ అవగా.. రన్నర్ గా షణ్ముఖ్ నిలిచాడు. గత ఆదివారం రాత్రి అదిరిపోయే బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో అదిరిపోయే గెస్ట్ ల మధ్యన సన్నీ విన్నర్ గా అవతరించాడు.

అయితే బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై నాగార్జున బిగ్ బాస్ ప్రేక్షకులకి ఓ గుడ్ న్యూస్ చెప్పాడు. అది ఎప్పుడూ ఆగష్టు, సెప్టెంబర్ లో మొదలు అయ్యే బిగ్ బాస్ వచ్చే ఏడాది అంటే.. 2022 లో చాలా త్వరగా మొదలు కాబోతుంది అని.. అది కొత్త సంవత్సరం మొదలైన రెండు నెలలకే బిగ్ బాస్ సీజన్ 6 మొదలు కాబోతున్నట్టుగా నాగ్ బుల్లితెర అందులోనూ బిగ్ బాస్ ప్రేక్షకులకి గుడ్ న్యూస్ చెప్పేసారు. మరి ఆ సీజన్ కి నాగార్జునే హోస్ట్ చేసేలా కనిపిస్తున్నారు. చూద్దాం ఆ టైం కి బిగ్ బాస్ హోస్ట్ నాగ్ చేస్తారా.. లేదంటే ఎవరైనా కొత్తగా వస్తారా అనేది..

Good news for the Bigg Boss audience:

Nagarjuna Reveals He Will Bigg Boss Telugu 6 Host

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ