Advertisementt

బిగ్ బాస్ విన్నర్ సన్నీ అయినా మారుస్తాడా..

Mon 20th Dec 2021 10:15 AM
bigg boss telugu season 5,bigg boss telugu,bigg boss,sunny,abhijith,shiva balaji,kaushal,rahul sipliganj,big boss winner sunny  బిగ్ బాస్ విన్నర్ సన్నీ అయినా మారుస్తాడా..
Will Bigg Boss winner Sunny change that? బిగ్ బాస్ విన్నర్ సన్నీ అయినా మారుస్తాడా..
Advertisement
Ads by CJ

నార్త్ తో లో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకోవడమే కాదు.. బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ ఎదో ఒకటి సాధిస్తున్నారు.. చేతి నిండా ఆఫర్స్ తో పరుగులు పెడుతున్నారు. కానీ సౌత్ బిగ్ బాస్ కి అంత క్రేజ్ లేదు.. నార్త్ లో సూపర్ హిట్ అయినట్టుగా. సౌత్ బిగ్ బాస్ హిట్ అవ్వలేదు.. ఏదో బిగ్ బాస్ వస్తుంది చూస్తున్నారు కానీ.. బాలీవుడ్ లా హిట్ అయితే అవడం లేదు.. సో సో టాక్ తోనే తెలుగులో ఐదు సీజన్స్ పూర్తి చేసుకుంది బిగ్ బాస్. రీసెంట్ గానే గత ఆదివారంతో బిగ్ బాస్ సీజన్ 5 సక్సెస్ ఫుల్ గా పూర్తయ్యింది. ఈ సీజన్ లో సీరియల్ ఆర్టిస్ట్, వీజే అయిన సన్నీ బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. మరి ఇప్పటివరకు బిగ్ బాస్ విన్నర్ గా కప్ చేజిక్కించుకున్న వారు బిగ్ బాస్ ట్రోఫీ గెలిచాక ఎక్కడికో వెళిపోతారని ఎక్సపెక్ట్ చేసారు.

అంటే బిగ్ బాస్ క్రేజ్ తో కెరీర్ లో అదరగొట్టేస్తారనుకున్నారు. కానీ బిగ్ బాస్ టైటిల్ వన్ శివబాలాజీ దగ్గరనుండి.. గత ఏడాది బిగ్ బాస్ విన్నర్ అయిన అభిజిత్ వరకు.. ఎవ్వరూ ఎలాంటి లక్ష్యం లేకుండా తిరుగుతున్నారు. కనీసం బిజీగా మారిన సందర్భము లేదు. శివ బాలాజీ టైటిల్ వన్ విన్నర్ గా ఖాళీ, బిగ్ బాస్ 2 కౌశల్ నాలుగేళ్లకు ఇప్పటికి ఓ సినిమా చేసాడు. బిగ్ బాస్ 3 విన్నర్ రాహుల్ సాంగ్స్ తో అంతో ఇంతో సత్తా చాటుతున్నాడు. ఇక నాలుగో విన్నర్ అభిజిత్ ఏడాది పాటు ఖాళీగా ఉండి.. ప్రస్తుతం అమెరికా, యూరప్ వెకేషన్ ట్రిప్ లో తిరుగుతున్నాడు.. మరి నాలుగు సీజన్స్ విన్నర్స్ సాధించలేనిది.. సీజన్ 5 విన్నర్ అయినా సాధిస్తాడా? సన్నీ సినిమాలతో బిజీ అయ్యి.. విన్నర్స్ ఏం పీకలేదు అనే టాగ్ లైన్ ని మారుస్తాడా.. చూద్దాం మనోడి ఫేట్ ఎలా ఉందొ అనేది..

Will Bigg Boss winner Sunny change that?:

Bigg Boss Telugu season 5 winner Sunny

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ