Advertisementt

పుష్ప ది రూల్ రిలీజ్ ఎప్పుడంటే..

Mon 20th Dec 2021 10:00 AM
allu arjun,pushpa the rise,pushpa the rule,sukumar,rashmika,fahad fasil,pushpa 2 release date confirmed  పుష్ప ది రూల్ రిలీజ్ ఎప్పుడంటే..
Pushpa 2 Release Date Confirmed? పుష్ప ది రూల్ రిలీజ్ ఎప్పుడంటే..
Advertisement
Ads by CJ

సుకుమార్ - అల్లు అర్జున్ కాంబోలో తెరకెక్కిన పుష్ప ది రైజ్ డిసెంబర్ 19 న రిలీజ్ అయిన ఐదు భాషల్లోనూ ప్రభంజనం సృష్టించింది. భారీ క్రేజ్ తో, భారీ అంచనాలతో శుక్రవారం రిలీజ్ అయిన పుష్ప సినిమాని అన్ని భాషల ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. పుష్ప పార్ట్ వన్ పుష్ప ది రైజ్ ని కొద్దిగా హడావిడిగా రిలీజ్ చేసినా.. పుష్ప పార్ట్ 2 పుష్ప ది రూల్ ని వచ్చే ఏడాది రిలీజ్ చెయ్యబోతున్నారు. పుష్ప సినిమా పార్ట్ వన్ రిలీజ్ కి ఎక్కువ సమయం లేకపోవడంతో.. హడావిడి ప్రమోషన్స్ తో రిలీజ్ అయిన.. సూపర్ హిట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. పార్ట్ టు షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది అని, పార్ట్ వన్ లో ఉన్న లోపాలను, ఆడియన్స్ కి నచ్చనివి లేపేసి.. ఇంట్రెస్టింగ్ గా పార్ట్ టు ని సిద్ధం చెయ్యబోతున్నారట.

పార్ట్ వన్ లో దేవిశ్రీ నేపధ్య సంగీతానికి మైనస్ మార్కులు పడినాయి. అలాగే నిడివి ఇబ్బంది పెట్టింది.. పుష్ప ది రూల్ లో ఆరమ్స్ గా అలాంటి లోపాలేమి లేకుండా టీం అన్ని సెట్ చేసుకోబోతుంది. ఇక పుష్ప పార్ట్ వన్ లో విఎఫెక్స్ కూడా మైనస్ లలో ఒకటిగా నిలిచింది.. మరి వీటన్నిటి లెక్క సరిచేసి మరీ.. భారీ ప్రమోషన్స్ తో పుష్ప పార్ట్ 2 పుష్ప ద రూల్ ని వచ్చే ఏడాది నవంబర్ లో కానీ, డిసెంబర్ లో కానీ రిలీజ్ చేసేందుకు సుకుమార్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక హిట్ టాక్ తెచ్చుకున్న పుష్ప సినిమా సక్సెస్ మీట్ ని తిరుపతిలో నిర్వహించబోతున్నారు. పుష్ప టీం మొత్తం తిరుపతిలో ఈ నెల 23 న పుష్ప మాసివ్ ఈవెంట్ లో సందడి చేయబోతుంది.

Pushpa 2 Release Date Confirmed?:

Allu Arjun Pushpa 2 Release Date Confirmed?