Advertisementt

S.S రాజమౌళిలో SS అంటే..

Sun 19th Dec 2021 08:18 PM
rajamouli,bigg boss,bigg boss telugu,bigg boss 5 grand finale,funny comments,bigg boss grand finale stage  S.S రాజమౌళిలో SS అంటే..
Rajamouli Funny Comments at Bigg Boss Grand Finale stage S.S రాజమౌళిలో SS అంటే..
Advertisement
Ads by CJ

S.S రాజమౌళి లో SS అంటే ఏమిటి అని బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున దర్శక ధీరుడు రాజమౌళి ని బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పైన వేశారు. అలాగే RRR అంటే కూడా ఏమిటి అని అడిగారు నాగార్జున. అయితే S అంటే ఏమి లేదని.. SS అంటే శ్రీశైల శ్రీ రాజమౌళి అన్న ఆయన.. అదే ఇంగ్లీష్‌లో అయితే S అంటే సక్సెస్‌.. మరో S అంటే స్టుపిడ్‌ అంటూ నాగ్ తో పాటుగా కామెడీ చేసారు. బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే కి ఫస్ట్ గా రాజమౌళి వచ్చారు. ఇక RRR పై నాగ్ అడిగిన ప్రశ్నకి.. ట్రైలర్ లో చెప్పాం కదండీ అన్నారు జక్కన్న. ఇక RRR ట్రైలర్ చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చాయండి.. చరణ్, టాక్, యాక్షన్ సీన్స్ అన్ని అదిరిపోయాయి అని నాగ్ అనగానే.. చాలా థాంక్స్ అండి.. మీరు ఇలా చెప్పి అని నాగార్జునతో రాజమౌళి చెప్పారు. 

మీరు అసలు చరిత్రలో పొంతన లేని ఇద్దరిని ఎలా కలపాలో బాగా తెలుసు అని నాగ్ అన్నాడు. నాకు చిన్నప్పటి నుంచి కూడా చారిత్రాత్మక పాత్రలు ఒకే వెండితెరపై చూపించాలని ఎంతో ఆశగా ఉండేది అని అదేవిధంగా RRR సినిమా లో కూడా ఇద్దరి సమరయోధులను చాలా బలంగా చూపించినట్లు చెపాప్రు రాజమౌళి.

ఇక రాజమౌళి.. తర్వాత తాను తెలుగులో సమర్పిస్తున్న బ్రహ్మాస్త్ర టీం ని స్టేజిపైకి పిలిచారు. అందులో బాలీవుడ్ స్టార్స్ అలియా భట్, రణబీర్ కపూర్, అయాన్ ముఖర్జీ లు బిగ్ బాస్ స్టేజ్ పై సందడి చేసారు. ఆ తర్వాత ఆర్కా మీడియా నిర్మిస్తున్న పరంపర నిర్మాతలని పిలిచి రాజమౌళి.. వాళ్లతో మాట్లాడించారు. ఇక తర్వాత పుష్ప టీం దర్శకుడు సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్, రష్మికాలు బిగ్ బాస్ స్టేజ్ పైకి రావడమే కాదు.. రష్మిక, దేవిశ్రీ హౌస్ లోపలికి వెళ్లి సిరిని ఎలిమినేట్ చేసి మరీ స్టేజిపైకి తీసుకొచ్చారు. అది కూడా డాన్స్ లతో హుషారుగా ఫినాలేలో సందడి చేసారు. 

Rajamouli Funny Comments at Bigg Boss Grand Finale stage:

Bigg Boss Telugu 5: Siri Hanmanth eliminated

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ