Advertisementt

బిగ్ బాస్ సన్నీకి ఐ లవ్ యు చెప్పిన అలియా

Sun 19th Dec 2021 07:14 PM
bigg boss 5,bigg boss telugu,bigg boss 5 grand final,rajamouli,ranbir kapoor,alia bhatt,ayan mukherji  బిగ్ బాస్ సన్నీకి ఐ లవ్ యు చెప్పిన అలియా
Bigg Boss 5: Grand Finale Highlights బిగ్ బాస్ సన్నీకి ఐ లవ్ యు చెప్పిన అలియా
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ నిజంగానే గ్రాండ్ గా మొదలైపోయింది. సీజన్ 5 హౌస్ లోకి అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ లో 14 మంది బిగ్ బాస్ హౌస్ నుండి 14 వారాలకు ఎలిమినేట్ అయ్యి వెళ్లిపోయారు.. వారంతా బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే స్టేజ్ పై తమ తమ డాన్స్ లతో అదరగొట్టేసారు. అలాగే తాము ఎలిమినేట్ అయ్యాక బిగ్ బాస్ వలన ఎంతగా లాభ పడ్డామో తమకొచ్చిన అవకాశాలను నాగార్జునా కి వివరించేసారు. ఇక హౌస్ లో ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్ తమ డాన్స్ తో గ్రాండ్ గా వెల్ కం ఇచ్చేసారు. ఇక గ్రాండ్ ఫినాలేకి బోలెడంతమంది సెలబ్రిటీస్ రావడం హైలెట్ అయ్యింది. ముందుగా ఎస్ ఎస్ రాజమౌళి బిగ్ బాస్ స్టేజ్ పైకి వచ్చారు.. ఇక సిరి టాప్ 5 నుండి మొదటిగా ఎలిమినేట్ అవ్వగా, మానస్ నాలుగవ కంటెస్టెంట్ గా బయటికి వచ్చేసాడు.

ఇక బిగ్ బాస్ కి గ్రాండ్ అతిధులుగా అలియా భట్, రణబీర్ లు రావడం నిజంగా సూపర్బ్. బాలీవుడ్ లో పెద్ద స్టార్స్ అయిన అలియా భట్, రణబీర్ కపూర్ తెలుగు బిగ్ బాస్ కి అతిధులుగా రావడం అనేది నిజంగా సూపరే. నాగార్జునే వీరిని గెస్ట్ లుగా ఆహ్వానించి స్టార్ మా బాగా హెల్ప్ చేసారు. ఇక స్టేజ్ పైకి అలియా ని, రణబీర్ ని రాజమౌళి ఆహ్వానించారు. అందరికి నమస్కారం అన్న అలియా భట్ ని స్టేజ్ పై చూడగానే హౌస్ లో ఉన్న సన్నీ టేబుల్ పై ఎక్కేసాడు. నేను ఎప్పుడొచ్చినా ఇలాంటి వెల్ కం చెప్పలేదు అని నాగ్ ఫన్ చేసాడు.. ఇక సన్నీ అలియా భట్ సర్ అనగానే.. య సన్నీ ఐ లవ్ యు అన్న అలియా ని చూసిన సన్నీ నిజంగానే కింద పడిపోయాడు.. ఇక అలియాని చూస్తూ సన్నీ బాలయ్య డైలాగ్ దబిడి దిబిడే అనగానే.. అలియా భట్ అలవోకగా సన్నీ చెప్పిన బాలయ్య డైలాగ్ దబిడి దిబిడే అని చెప్పి అందరికి షాకివ్వగా.. రణబీర్ కపూర్ అయితే నాగ్ చెప్పమన్నట్టుగా ఆడియన్స్ అందరికి నా ముద్దులు అంటూ తెలుగులో చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. 

Bigg Boss 5: Grand Finale Highlights:

Bigg Boss 5: Grand Finale update

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ