Advertisementt

పుష్ప కలెక్షన్స్ సునామీ.. 2 రోజుల్లో 116 కోట్ల గ్రాస్..

Sun 19th Dec 2021 04:41 PM
pushpa,allu arjun,sukumar,rashmika,pushpa worldwide 2 days collections  పుష్ప కలెక్షన్స్ సునామీ.. 2 రోజుల్లో 116 కోట్ల గ్రాస్..
Pushpa Collection Tsunami,116 cr grass in 2 days .. పుష్ప కలెక్షన్స్ సునామీ.. 2 రోజుల్లో 116 కోట్ల గ్రాస్..
Advertisement
Ads by CJ

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. మొదటి రోజు 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. రెండో రోజు కూడా అదే జోరు చూపించాడు. తొలిరోజు 71 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు మరో 45 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. తెలుగు ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాస్తున్నాడు అల్లు అర్జున్. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది పుష్ప. రెండో రోజు కూడా ఈ చిత్రానికి అన్నిచోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. మూడో రోజు కూడా అద్భుతంగా ఓపెన్ అయింది. అల్లు అర్జున్ మాస్ స్టామినాకు ఇది నిదర్శనం. 

అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్‌కు అంతా ఫిదా అయిపోతున్నారు. పుష్ప సినిమాను కేవలం అల్లు అర్జున్ కోసమే చూడొచ్చు అనేలా థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు ఆడియన్స్. కేవలం తెలుగులోనే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ చిత్రం. తమిళం, హిందీలో అయితే అంచనాలకు మించి అద్భుతమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది పుష్ప. అల్లు అర్జున్ ఐకానిక్ ఇమేజ్‌కు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 116 కోట్ల గ్రాస్ వచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారీ కీలక పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పుష్ప సినిమాను నిర్మించారు.

Pushpa Collection Tsunami,116 cr grass in 2 days ..:

Pushpa Worldwide 2 Days Collections

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ