Advertisementt

పిక్ టాక్: RRR బ్రదర్స్.. బ్యాక్ స్టేజ్ బ్రోమాన్స్

Sun 19th Dec 2021 12:39 PM
jr ntr,ram charan,rrr pre-release event,rajamouli,rrr movie,mumbai  పిక్ టాక్: RRR బ్రదర్స్.. బ్యాక్ స్టేజ్ బ్రోమాన్స్
Pic Talk: RRR Brothers, Backstage Bromance పిక్ టాక్: RRR బ్రదర్స్.. బ్యాక్ స్టేజ్ బ్రోమాన్స్
Advertisement
Ads by CJ

ఆర్.ఆర్.ఆర్ లో స్నేహితులుగా, అన్నదమ్ముల్లా కనిపించిన ఎన్టీఆర్ రామ్ చరణ్ లు ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ లో ఎంజాయ్ చేస్తున్నారు. వీరిద్దరూ కలిసి ఉన్న పిక్ చూస్తే ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫాన్స్ ఆగడం లేదు.. ఇద్దరు సూపర్ స్టార్స్ తరుచూ ఒకే పిక్ లో కనబడుతుంటే ఫాన్స్ కి పూనకాలే అన్నట్టుగా ఉంటుంది. మొన్నామధ్యన బెంగుళూర్, చెన్నై, హైదరాబాద్ ప్రెస్ మీట్స్ లో కలిసి కన్నుల పండగగా సందడి చేసిన రామ్ చరణ్ , ఎన్టీఆర్ లు సినిమాలోనే కాదు బయట కూడా ఫ్రెండ్స్. ఆ విషయం అందరికి పెద్దగా ఫోకస్ కాకపోయినా.. ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ తో మాత్రం ఫాన్స్ ని సర్ ప్రైజ్ చేస్తూనే ఉన్నారు ఈ ఇద్దరు కలిసి.

అయితే ఈ రోజుల ఆదివారం సాయంత్రం ముంబై లో ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని భారీ లెవల్లో ప్లాన్ చేసారు జక్కన్న. దాని కోసం ఆర్.ఆర్.ఆర్ బ్రదర్స్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ముంబై కి వెళ్లిపోయారు. అక్కడ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి హుషారుగా మాట్లాడుకుంటున్న పిక్ ని ఎన్టీఆర్ సోషల్ మీడియాలో షేర్ చేసాడు.. Backstage bromance… Gearing up for #RoarofRRRinMumbai … అంటూ పిక్ ని అభిమానులతో పంచుకున్నఉడ్. ముంబైలో జరగ బోయే ఈవెంట్ కోసం అన్నట్టుగా ఆ ఇద్దరు తెగ ముచ్చటించేసుకుంటున్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బాలీవుడ్ బడా హీరో సల్మాన్ ఖాన్ గెస్ట్ గాను, బాలీవుడ్ కింగ్ మేకర్ కరణ్ జోహార్ హోస్ట్ గాను రాబోతున్నారు. మరి ముంబైలో జరగబోయే ఆర్.ఆర్.ఆర్ ఈవెంట్ కోసం అన్ని భాషలు ప్రేక్షకులు తెగ వెయిట్ చేస్తున్నారు.

Pic Talk: RRR Brothers, Backstage Bromance :

Jr NTR and Ram Charan gear up for RRR pre-release event in Mumbai

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ