రంగస్థలం తర్వాత సుకుమార్ ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథని రెడీ చేసి.. మహేష్ చుట్టూ తిరిగాడు.. మహేష్ కూడా ముందు ఓకె అని తర్వాత సుకుమార్ తో సినిమా క్యాన్సిల్ చేసుకుని.. టెక్నీకల్ ఇష్యుస్ వలన సుకుమార్ తో సినిమా ఆగింది అని చెప్పాడు. తర్వాత అదే కథని సుకుమార్ అల వైకుంఠపురములో హిట్ తో ఉన్న బన్నీకి చెప్పడం.. రంగస్థలం లాంటి బిగ్ హిట్ తో ఉన్న ఆయన కథ పావుగంట చెప్పగానే.. పుష్ప కథకి కనెక్ట్ అవడమే కాదు.. అల్లు అర్జున్ సుకుమార్ తో దీనిని పాన్ ఇండియా కథగా సినిమా తీద్దామని సలహా ఇవ్వడం, సుక్కు కూడా నిర్మాతల సహకారంతో పుష్పని ఐదు భాషల్లో పూర్తి చేసేసాడు.
మరి నిజంగా ఏ దర్శకుడు కూడా అల్లు అర్జున్ ని అంత మాస్ గా చూపించాడేమో అనేలా పుష్ప గా అల్లు అర్జున్ లుక్ అందరిని ఆకట్టుకునేలా చూపించాడు. సినిమాకి అల్లు అర్జున్ ఆయువు పట్టు అనేలా తెరకెక్కించాడు. అయితే సినిమా ని రెండు పార్ట్ లు అనేసరికి.. మొదటిపార్ట్ లో చెప్పయ్యాల్సిన కథ.. రెండో పార్ట్ కి షిఫ్ట్ అయ్యి. అది కాస్త నిడివి పెరిగి లాగింగ్ సీన్స్ తో పుష్ప సినిమాకి దెబ్బేసింది. పుష్పాకి మంచి ఓపెనింగ్స్ వచ్చినా.. మిక్స్డ్ టాక్ తో అనుకున్న టార్గెట్ పుష్ప రీచ్ అవడం కష్టమనేలా ఉంది.
మరి అల్లు అర్జున్ టైప్ లో మేకోవర్ అయితే మహేష్ ఖచ్చితంగా అయ్యేవాడు కాదు. అందుకే మహేష్ ఎర్రచందనం స్మగ్లింగ్ కథని రిజెక్ట్ చేసాడు. సినిమా కొచ్చిన మిక్స్డ్ టాక్ చూసిన మహేష్ ఫాన్స్.. మహేష్ తప్పించుకుని మంచి పని చేసాడు.. లేదంటే మహేష్ కున్న క్లాస్ ఇమేజ్ మొత్తం పోయేది అంటున్నారు. మరి నిజంగానే సుక్కు మహేష్ కి ఇదే కథ చెప్పాడా.. అనే అనుమానం ఇప్పుడు అందరిలో బయలు దేరింది.