Advertisementt

నయట్టు రీమేక్ అటకెక్కింది

Sat 18th Dec 2021 03:42 PM
nayattu malayalam movie,allu aravind,nayattu remake in telugu,bunny vas,karun kumar  నయట్టు రీమేక్ అటకెక్కింది
Nayattu remake in Telugu to be paused? నయట్టు రీమేక్ అటకెక్కింది
Advertisement
Ads by CJ

గీత ఆర్ట్స్ అల్లు అరవింద్ మలయాళం సినిమా నయట్టు రీమేక్ రైట్స్ కొన్న సంగతి తెలిసిందే. పలాస డైరెక్టర్ కరుణ కుమార్ తో తెలుగులో ఈ మలయాళం సినిమాని రీమేక్ చేద్దామని కొన్ని నెలలు కిందట అనుకోని అందరికి అడ్వాన్స్ కూడా ఇచ్చారు. రావు రమేష్, అంజలి, శ్రీ విష్ణు ప్రధాన పాత్రలుగా అనుకోని అరకు లో షూటింగ్ చెయ్యాలని కూడా అనుకున్నారు. అన్నిటికి రంగం సిద్ధం చేసుకొని ఇప్పుడు ఈ సినిమాని వెనక్కి నెట్టేశారు. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, అరవింద్ ఈ సినిమా ఇప్పుడు చేయొద్దు షేల్వ్ చేసెయ్యండి అని చెప్పారట. 

అల్లు అరవింద్ అలా చెప్పడంతో బన్నీ వాసు..  డైరెక్టర్ కరుణ కుమార్ ని పిలిచి ఈ రీమేక్ ఇప్పుడు చెయ్యటం లేదని చెప్పేశారట. ఇచ్చిన అడ్వాన్స్ కూడా అందరి దగ్గర వెనక్కి తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే అరవింద్ ఎందుకు వద్దు అన్నారు అన్నది తెలియటం లేదు. బడ్జెట్ పరంగా కొన్ని ఇబ్బందులు ఎదురయినట్టుగా తెలుస్తోంది. ఏది ఏమైనా నయట్టు అయితే అటకెక్కినట్టే. 

Nayattu remake in Telugu to be paused?:

Nayattu remake in Telugu cancelled

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ