Advertisementt

జూనియర్‌ ఆర్టిస్టులకు గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం

Sat 18th Dec 2021 11:04 AM
hyderabad,gachibowli road accident,junior artists,driver,band employee,manasa  జూనియర్‌ ఆర్టిస్టులకు గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం
Hyderabad: 3 die in road accident in Gachibowli జూనియర్‌ ఆర్టిస్టులకు గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం
Advertisement
Ads by CJ

తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హెచ్‌సీయూ రోడ్‌లో 100 కిలోమీటర్లు వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా ఒకరు ప్రాణాపాయ పరిస్థితుల్లో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మృతిచెందిన వారిలో ఇద్దరు జూనియర్‌ ఆర్టిస్టులు, కారు  డ్రైవ్‌ చేస్తున్న ఓ బ్యాంకు ఉద్యోగి అని తెలుస్తుంది. మరో జూనియర్‌ ఆర్టిస్ట్ సిద్ధు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నాడు. గచ్చిబౌలి ప్రమాదంలో మృతి చెందివ వారిని అబ్దుల్‌ రహీమ్‌, ఎన్‌.మానస, ఎం.మానసగా గుర్తించారు. మానస లు ఇద్దరూ అమీర్‌పేట్‌లోని హాస్టల్లో ఉంటున్నారు. అబ్దుల్‌.. మాదాపూర్‌లోని యాక్సిస్ బ్యాంకులో పని చేస్తున్నారు.

నిన్న రాత్రి గచ్చిబౌలిలోని సిద్ధూ ఇంటికి ఎం.మానస, అబ్దుల్‌, ఎన్‌. మానస వెళ్లారు. అయితే కారు నడిపిన బ్యాంకు ఉద్యోగి మద్యం మత్తులో డ్రైవింగ్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి గురైన ఈ నలుగురికి ఎలా పరిచయం ఉందన్న వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

Hyderabad: 3 die in road accident in Gachibowli:

Three killed after car crashes into road median in Hyderabad

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ