Advertisementt

అడివి శేష్ హిట్ 2 గ్లింప్స్

Sat 18th Dec 2021 10:57 AM
hit 2,adivi sesh,hit 2 glimpse,nani,major,goodachari 2  అడివి శేష్ హిట్ 2 గ్లింప్స్
Adivi Sesh HIT 2 first glimpse attracts అడివి శేష్ హిట్ 2 గ్లింప్స్
Advertisement
Ads by CJ

క్ష‌ణం, గూఢ‌చారి, ఎవ‌రు వంటి వైవిధ్య‌మై క‌థా చిత్రాల్లో హీరోగా న‌టించిన త‌న‌కంటూ ఓ ప్రత్యేక‌మైన గుర్తింపు సంపాదించుకున్న క‌థానాయ‌కుడు అడివి శేష్‌. ఈ వెర్స‌టైల్ హీరో  ఇప్పుడు దేశ‌భ‌క్తితో నిండిన పాన్ ఇండియా మూవీ మేజ‌ర్‌ తో పాటు సీట్ ఎడ్జ్ క్రైమ్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ హిట్ 2తోనూ తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌నున్నారు. ‘హిట్ 2’ను హీరో నాని సమర్పణలో వాల్‌పోస్టర్‌ సినిమా బ్యానర్‌పై ప్రశాంతి త్రిపిర్‌నేని నిర్మిస్తున్నారు.  శుక్ర‌వారం (డిసెంబ‌ర్ 17) అడివి శేష్ పుట్టిన‌రోజు ఈ సంద‌ర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను హీరో, చిత్ర స‌మ‌ర్ప‌కుడు నేచుర‌ల్ స్టార్‌ నాని విడుద‌ల చేశారు. ఇందులో అడివి శేష్ ఇందులో ఆంధ్రప్రదేశ్‌ చెందిన హిట్‌ టీమ్‌ ఆఫీసర్‌ కృష్ణ దేవ్‌ అలియాస్‌ కె.డిగా మెప్పించ‌నున్నారు. 

గ్లింప్స్‌ను గ‌మ‌నిస్తే.. పోలీస్ ఆఫీస‌ర్ డ్రెస్‌లో అడివి శేష్ ఏదో కేస్‌ను చేధించ‌డానికి త‌న వంతు ప్ర‌య‌త్నాల‌ను చేయ‌డం.. ఏదో అన్వేషిస్తున్న‌ట్లు క‌నిపిస్తున్నారు. త‌న లుక్ చాలా కూల్‌గా, స్టైలిష్‌గా ఉంది. త‌న‌తో పాటు ఓ పోలీస్ డాగ్ ఉండ‌టాన్ని ఈ గ్లింప్స్‌లో మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. అలాగే విల‌న్స్‌ను భ‌ర‌తం ప‌ట్టే పోలీస్ ఆఫీస‌ర్‌గానూ అడివి శేష్‌ను మ‌నం చూడొచ్చు. ఏదో కేసు గురించి త‌ను చాలా సీరియ‌స్‌గానూ ఆలోచిస్తున్న‌ట్లు మ‌న‌కు క‌నిపిస్తుంది. ఇదే బ్యాన‌ర్‌లో రూపొంది ఘన విజయం సాధించిన సీట్ ఎడ్జ్ థ్రిల్లర్  ‘హిట్‌’ సినిమాకు ఫ్రాంచైజీగా రూపొందుతోన్న చిత్రమే హిట్ ‌2. ది సెకండ్‌ కేస్‌ సినిమా ట్యాగ్‌లైన్‌. హిట్‌ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శైలేష్‌ కొలను దర్శకత్వంలోనే హిట్ 2 సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. హిట్ చిత్రంలో హీరో చాలా సీరియస్‌గా కనిపిస్తే... ఇందులో మాత్రం అడివి శేష్ చాలా బ్రీజీ లుక్‌లో ఉండ‌టాన్ని మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఇప్ప‌టి వ‌ర‌కు సినిమా చిత్రీక‌ర‌ణ 90 శాతం పూర్త‌య్యింది. 

Adivi Sesh HIT 2 first glimpse attracts:

Hit 2 glimpse attracts with intensity

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ