Advertisementt

రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో రష్మిక మందన్న

Fri 17th Dec 2021 11:02 PM
rahul ravindran,rashmika mandanna,rahul direction,allu aravind  రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో రష్మిక మందన్న
Rashmika Madnanna under Rahul Ravindran direction రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో రష్మిక మందన్న
Advertisement
Ads by CJ

పుష్ప లో ఒక పల్లెటూరి అమ్మాయిగా మెప్పించిన రష్మిక మందన్న చాలా బిజీగా వున్న నటీమణుల్లో ఒకరు.  హిందీ మరియు సౌత్ లో బిజీగా వున్న రష్మిక ఇప్పుడు ఇంకొక తెలుగు సినిమా చేస్తోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం లో ఒక సినిమా రాబోతోం..ది అందులో రష్మిక ప్రధాన పాత్ర పోషిస్తోందని తెలుస్తుంది. ఈ సినిమాని జిఏ 2 ప్రొడ్యూస్ చేస్తోంది. రాహుల్ రవీంద్రన్ ఇంతకు ముందు చి.ల.సౌ, మన్మధుడు-2 సినిమాలకి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. అయితే  మన్మధుడు-2 కి చాలా విమర్శలు ఎదుర్కోవడమే కాకుండా, ఆ సినిమా పెద్ద ప్లాప్ కూడా అయింది. ఇప్పుడు రాహుల్ తన స్క్రిప్ట్ ని అల్లు అరవింద్ కి వినిపించగా అతను నచ్చి సినిమా చెయ్యడానికి ముందుకు వచ్చారు. 

ఈ సినిమాలో రష్మిక పక్కన ఎవరు నటిస్తున్నారు అన్నది ఇంకా డిసైడ్ చెయ్యలేదు అని భోగట్టా. ఎందుకంటే ఈ కథ అంతా రష్మిక చుట్టూ తిరుగుతూ ఉంటుంది, అందుకని రష్మిక పక్కన చేసే హీరోని తరువాత ఎంపిక చేయొచ్చు అని తెలుస్తుంది. అల్లు అర్జున్ పుష్ప సినిమా ప్రమోషన్స్ లో భాగంగా రష్మిక ని మీడియా తో పాటుగా ఫాన్స్ కూడా చాలా పొగిడారు. ఆమె మంచి సినిమాలు పడితే ఇంకా పైకి వస్తుందని చెప్పారు. రష్మిక ఇప్పుడు అల్లు అర్జున్ ఫాదర్ అల్లు అరవింద్ తో సినిమా చెయ్యడం యాదృచ్చికం ఏమో. గతంలో గీత గోవిందం లో కూడా రష్మిక ఇదే బ్యానర్ లో చేసిన సంగతి తెలిసిందే.

Rashmika Madnanna under Rahul Ravindran direction:

Buzz is Rahul Ravindran is planning a female-oriented film with Rashmika Mandanna

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ