బోయపాటి దర్శకత్వంలో అఖండ అంటూ త్రిసూలం పట్టుకుని మరీ గర్జించిన బాలకృష్ణ.. ప్రస్తుతం ఆ అఖండ సక్సెస్ టూర్ లో గుళ్ళు గోపురాలు తిరుగుతున్నారు. సింహాచలం మొదలుకుని, విజయవాడ, కాకాని, మంగళగిరి, తిరుమల లో శ్రీవారిని దర్శించుకున్న బాలకృష్ణ ఇకపై తాను నెక్స్ట్ చెయ్యబోయే NBK107 షూటింగ్ కోసం తయారవ్వబోతున్నారు. అఖండ లో అఘోర గా తనలోని నట విశ్వరూపం తో మాస్ ప్రేక్షకుల మనసులని కట్టిపడేసిన బాలయ్య.. తన తదుపరి మూవీలో ఎలా కనిపించబోతున్నారు.. దర్శకుడు గోపీచంద్ మలినేని బాలయ్యని ఎలా చూపించబోతున్నాడో అనే దానిమీద నందమూరి ఫాన్స్ ఆసక్తిగా ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో NBK107 పూజా కార్యక్రమాలతో మొదలైపోయింది. శృతి హాసన్ బాలయ్య సరసన హీరోయిన్ గా నటిస్తుండగా.. తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఓ పవర్ ఫుల్ రోల్ చేయబోతుంది.
అయితే ఈ సినిమాకి టైటిల్ గా రకరకాల పేర్లు ప్రచారంలో ఉన్నా.. గోపీచంద్ మలినేని - బాలయ్య కాంబోలో రాబోతున్న NBK107 కి ఓ పవర్ ఫుల్ టైటిల్ ని నిర్మాతలు రిజిస్టర్ చేయించారంటూ.. ప్రచారం జరుగుతుంది. అది వేటపాలెం అనే పవర్ ఫుల్ టైటిల్ ని గోపీచంద్ బాలయ్య కోసం ఫిక్స్ చేసాడని, ఈ సినిమాలో బాలయ్య డ్యూయెల్ రోల్ లో కనిపించబోతున్నారని.. వేటపాలెం సినిమాని పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించబోతున్నారని.. త్వరలోనే రెగ్యులర్ షూట్ మొదలు పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.