ఇప్పుడు ఏ హీరోయిన్ అవ్వనంతగా ట్రెండ్ అవుతుంది సమంత.. కారణం చైతూ తో విడాకుల తర్వాత సమంత సోషల్ మీడియా పోస్ట్ లు, ఆమె ఫోటో షూట్స్ అన్ని ఒక ఎత్తు ఆమె చేసిన పుష్ప ది రైజ్ స్పెషల్ సాంగ్ ఒక ఎత్తు అనేలా సమంత ట్రెండ్ అవుతుంది. సమంత పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ చేస్తుంది అనగానే అందరూ ఆశ్చర్యపోయారు. ఇంతవరకు ఒక్క ఐటెం సాంగ్ కూడా చెయ్యని సమంత స్పెషల్ సాంగ్ అనగానే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి.. ఆ సాంగ్ వీడియో రిలీజ్ అవ్వగానే సమంత గ్లామర్, హాట్ లుక్, ఆమె కనిపించిన విధానం, అల్లు అర్జున్ తో వేసిన మాస్ స్టెప్స్ అన్ని యూట్యూబ్ ని ఊపేసాయి.. సోషల్ మీడియాని షేక్ చేసేసింది. సమంత సాంగ్ పై పురుషల సంగం కోర్టుకి ఎక్కితే.. మహిళా సంఘం పాలాభిషేకాలు అబ్బో ఓ రేంజ్ లో సమంత ఊ అంటావా మావా.. ఉ ఊ అంటావా మావ సాంగ్ పాపులర్ అయ్యింది.
ఈ రోజు శుక్రవారం విడుదలైన పుష్ప సినిమాలో అల్లు అర్జున్ లుక్, ఆయన పెరఫార్మెన్స్ ని ఎంతగా పొగుడుతున్నారో.. సమంత స్పెషల్ సాంగ్ ని అంతే పొగడడం కాదు.. థియేటర్స్ లో ఫాన్స్ విజిల్స్, పేపర్స్ చించి పడేసి.. రచ్చ రచ్చ చేస్తున్నారు. సమంత సాంగ్ పై ఆడియన్స్ చాలా థ్రిల్ ఫీలవుతున్నారు. వేరే లెవెల్ అంటూ దేవిశ్రీ మ్యూజిక్, సమంత డాన్స్ ని పొగిడేస్తున్నారు. సోషల్ మీడియాలో సమంత సాంగ్ పై పాజిటివ్ రివ్యూస్ తో అదరగొట్టేస్తున్నారు. సమంత ని ఎత్తిపడేస్తున్నారు. పుష్ప సినిమా థియేటర్స్ లో సమంత స్పెషల్ సాంగ్ రచ్చ మాములుగా లేదు.. ఏ హీరోయిన్ కి ఇవ్వని ట్రిబ్యూట్ నిజంగా ఫాన్స్ సమంత కి ఈ సాంగ్ తో ఇచ్చేస్తున్నారు.