బిగ్ బాస్ సీజన్ 5 ఈ ఆదివారమే గ్రాండ్ ఫినాలేకి సిద్దమైపోయింది. 104 రోజుల జర్నీ ని.. బిగ్ బాస్ సీజన్ 5 కిందా మీద పడుతూ.. సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకుంది. ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో టాప్ 5 లో శ్రీరామ్, సిరి, షణ్ముఖ్, సన్నీ, మానస్ లు ఉన్నారు. వీరిలో ఎక్కువగా సన్నీ కే బిగ్ బాస్ సీజన్ 5 విన్నర్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కానీ ఓటింగ్ పరంగా మొదటి మూడు రోజులు సన్నీ మొదటి స్థానంలో ఉండగా.. తర్వాత రెండు రోజులు షణ్ముఖ్ అనూహ్యంగా నెంబర్ వన్ పొజిషన్ లోకి వచ్చేసాడు. బయట కూడా షణ్ముఖ్ కి ఓట్ చెయ్యాలంటూ ఆయన ఫాన్స్ తెగ పబ్లిసిటీ చేస్తున్నారు. షణ్ముఖ్ ని ఎలాగైనా గెలిపించాలని చూస్తున్నారు.
విన్నర్ అయ్యే ఛాన్స్, అయ్యేందుకు అన్ని అర్హతలు సన్నీ దగ్గరే ఉన్నాయి.. కానీ షణ్ముఖ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ముందు సన్నీ చిన్నబోయేలా కనబడుతున్నాడు. రోజు రోజుకి ఓటింగ్ ఈక్వేషన్స్ మారిపోతున్నాయి. మొదటి నుండి మూడో స్థానంలో ఉన్న శ్రీరామ్ చంద్ర నిన్న గురువారం ఓటింగ్ లో పుంజుకోవడం ఆసక్తికరంగా మారింది. ముందుగా సన్నీ ఫస్ట్ ప్లేస్ లో ఉంటే.. సెకండ్ ప్లేస్ లో షణ్ముఖ్ ఉన్నాడు.. తర్వాత షణ్ముఖ్ ఫస్ట్ ప్లేస్ లోకి, సన్నీ సెకండ్ ప్లేస్ లోకి వచ్చారు. శ్రీరామ్ కూడా ఇప్పుడు ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక 4th ప్లేస్ లో ఒకరోజు మానస్, మరో రోజు సిరి అన్నట్టుగా ఉంది వ్యవహారం.. ఫైనల్ గా షణ్ముఖ్ - సన్నీ - శ్రీరామ్ లలోనే ఎవరు విన్నర్ అవుతారు అనే దాని మీద ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొంది. మరి ఎప్పటిలాగే.. ఆదివారం గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్.. ఇప్పుడు కూడా శనివారం రాత్రే లీకైపోతుందేమో చూద్దాం.