అల్లు అర్జున్.. పుష్ప రాజ్ అంటూ విజిల్ వేసి బరిలోకి దిగిపోయాడు. తగ్గేదే లే.. తగ్గేదే లే.. అంటూనే పుష్ప సినిమాపై భీభత్సమైన అంచనాలు క్రియేట్ చేసాడు. సుకుమార్ రంగస్థలం బ్లాక్ బస్టర్ తర్వాత, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో తర్వాత వస్తున్న పుష్ప పై ట్రెడ్ లోనే కాదు.. ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు వచ్చేసాయి. పుష్ప రాజ్ లుక్ తోనే ఆ అంచనాలు తార స్థాయిలో నిలబెట్టారు. మరి ఎంతో స్పీడుగా సినిమాని కంప్లేట్ చేసి.. అంతే స్పీడు గా ప్రమోషన్స్ చేసి.. డిసెంబర్ 17 న బరిలోకి దిగిన పుష్ప మూవీ ని ప్రేక్షకులు కూడా గ్రాండ్ గానే రిసీవ్ చేసుకున్నారు.. ఒక్క మళయాళంలోనే పుష్ప సినిమా కి చిన్న ప్రాబ్లెమ్ వచ్చి బొమ్మ పడలేదు.
అయితే గత రాత్రి నుండే పుష్ప ప్రభంజనం ఓవర్సీస్ లో మొదలైపోయింది. కరోనా కరోనా అంటూ పెద్ద సినిమాలేవీ విడుదల కావడం లేదు.. చాలా సినిమాలు 2022 నే టార్గెట్ చేసాయి.. ఈ ఏడాది భారీ అంచనాలతో భారీగా విడుదలైన పుష్ప కోసం యుఎస్ ప్రేక్షకులు క్యూ కట్టేసారు. యూఎస్ ప్రీమియర్స్‌కి ఈ ఏడాది ఏ సినిమాకు లేనంతగా పుష్ప సినిమాకి డిమాండ్ నెలకొంది. ఓవర్సీస్ యూఎస్ లోని 248 లొకేషన్స్‌లో పుష్ప చిత్రాన్ని రిలీజ్ చేయగా.. ఈ ప్రీమియర్స్ ద్వారా దాదాపు 406k డాలర్స్ వసూలు చేసి పుష్ప ప్రభంజనం స్టార్ట్ చేసింది. 2021 సంవత్సరంలో బిగ్గెస్ట్ ప్రీమియర్స్ గ్రాస్ కలెక్షన్స్ రాబట్టిన తొలి రెండు చిత్రాల్లో అల్లు అర్జున్ పుష్ప ఒకటిగా నిలిచింది.
ఈ సినిమాలో అల్లు అర్జున్ లుక్, అల్లు అర్జున్ పెరఫార్మెన్స్, యాక్షన్ సీన్స్, ఎమోషనల్ సన్నివేశాలు, సమంత ఐటెం సాంగ్ హైలెట్ అవ్వగా.. రష్మిక శ్రీవల్లి కేరెక్టర్, అనసూయ, సునీల్ కేరెక్టర్స్, దేవిశ్రీ బ్యాగ్రౌండ్ స్కోర్ లు ఓకె ఓకె గా ఉన్నాయని ఓవర్సీస్ ప్రేక్షకుల ట్వీట్స్ చెబుతున్నాయి.