బిగ్ బాస్ సీజన్ 5 లో సిరి - షణ్ముఖ్ లు ఫ్రెండ్స్ గా అడుగుపట్టి.. బిగ్ బాస్ హౌస్ లో హగ్గులు, ముద్దులతో రెచ్చిపోవడంతో.. నెటిజెన్స్ వారిద్దరిని నానా రకాలుగా తిట్టిపోస్తున్నారు. సిరికి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ తో ఎంగేజ్మెంట్ అయ్యాక బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టింది.. ఆ మాత్రం బుద్ది లేకుండా షణ్ముఖ్ తో సిరి హగ్స్, కిస్ లు అంటూ చిరాకు తెప్పించింది. తల్లి చెప్పాక కూడా సిరి అలానే రెచ్చిపోయింది. ఆమె బిగ్ బాస్ లో కంటెంట్ ఇవ్వడం ద్వారా.. టాప్ 5 లోకి వెళ్లొచ్చనే కావాలని చేసింది అంటూ సిరిపై అందరూ దుమ్మెత్తిపోస్తున్నారు..
ఇదంతా చూసిన సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ స్పందిస్తూ.. నన్ను ఎవరేమన్నా పట్టించుకోలేదు.. కానీ సిరిని అంటే ఊరుకునేది లేదని చెబుతూనే.. సిరి బిగ్ బాస్ హౌస్ లో ఉండేందుకు, షణ్ముఖ్ తో క్లోజ్ అవ్వలేదు.. వీరిద్దరూ ఫ్రెండ్స్.. టాస్క్ ల పరంగా షణ్ముఖ్ ని సిరి వాడుకోలేదు.. ఒకవేళ సిరి లేకపోతె అతనేమైపోయేవాడో.. ఎవరితో కలవడు.. సిరి లేకపోతే అతను ఆఖరికి పిచ్చివాడైపోయెవాడు. సిరి టాస్క్ ల విషయంలో అతనికన్నా చాలా బెటర్. సిరి ని అతను కంట్రోల్ చేసాడు కానీ.. సిరి ఎప్పుడూ అతన్ని కంట్రోల్ చెయ్యలేదు. బిగ్ బాస్ హౌస్ లో కొనసాగడానికి అతన్ని సిరి వాడుకోలేదు.. అతనే సిరిని వాడుకున్నాడు.. సిరి ఫ్రెండ్ షిప్ లేకపోతె అతనెప్పుడో బయటికి వచ్చేసేవాడు..
ఎవరితో మాట్లాడనివ్వడు, కలిసి డాన్స్ చెయ్యనివ్వడు, నేనే నీకు, నేనే నీ ప్రపంచం అని క్రియేట్ చేస్తే ఆమె ఏం చేస్తుంది. ఎవ్వరి దగ్గరికి వెళుతుంది.. ఎందుకులే అని ఊరుకుంటుంటే.. ఒక అమ్మయిని ఇలా నెగిటివిటి చేస్తారా.. అందులోను బిగ్ బాస్ ఫైనల్స్ దగ్గరలో అంటూ సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్.. షణ్ముఖ్ పేరు ఎత్తకుండా ఇండైరెక్ట్ గా షణ్ణుకి ఇచ్చిపడేసాడు.