హీరో గా సినిమా చేస్తే.. ఆ సినిమా హిట్ అయినప్పుడు క్రెడిట్ అంతా హీరోలకి వెళ్లడం అనేది అందరికి తెలిసిన విషయమే. కానీ రాజమౌళి వచ్చాక కేవలం హీరోలకే క్రెడిట్ అనే పదం మారిపోయి.. అది దర్శకులకి షేర్ అయ్యింది. ఇక తాజాగా అల్లు అర్జున్ - సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పుష్ప ద రైజ్ మరికొద్దిగంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా మొదలు పెట్టాక ఎన్నో సమస్యలు, ఎన్నో గండాలు దాటింది. అచ్చంగా అడవుల్లోని ఉండి షూటింగ్ చేసిన రోజులు కోకొల్లలు.. అయినా కథ మీద నమ్మకంతో వేటిని లెక్క చెయ్యలేదు. అయితే షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు దగ్గరపడిన పుష్ప మూవీ ప్రమోషన్స్ లో అడుగడుగునా ఆటంకాలే.. అసలే టైం తక్కువ ఉంది.. అందులోనూ పరుగులు ఉరుకులు ప్రమోషన్స్ ని నిజంగా అల్లు అర్జున్ ఒంటి చేత్తో మోశాడు.
దర్శకుడు సుకుమార్.. విడుదలకు ముందు వరకు పుష్ప పోస్ట్ ప్రొడక్షన్ పనులతో సతమతమయ్యారు.. ఆయన్ని డిస్ట్రబ్ చెయ్యకుండా.. అల్లు అర్జున్ సోలోగా ప్రమోషన్స్ చేసాడు. హైదరాబాద్ దగ్గర నుండి ముంబై వరకు అల్లు అర్జున్ పుష్ప ని ప్రమోట్ చేస్తూ వచ్చాడు. అది కూడా రెస్ట్ అన్నదే లేకుండా ఆఘమేఘాల మీద అల్లు అర్జున్ పుష్ప ప్రమోషన్స్ చక్కబెట్టేసాడు. హైదరాబాద్ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి టీం తో హాజరైన్ అల్లు అర్జున్ చెన్నైలో ఒంటరిగా కనిపించాడు, బెంగుళూరు, మలయాళంలో హీరోయిన్ రష్మిక తో ప్రెస్ మీట్స్ పెట్టాడు. ముంబైలో దేవిశ్రీ, రశ్మికలతో కలిసి సినిమాని ప్రమోట్ చెయ్యడమే కాదు.. ఫస్ట్ టైం జాతీయ మీడియా మీట్ లో పాల్గొంటున్నటుగా చెప్పాడు. కన్నడలో ప్రెస్ మీట్ లేట్ అయ్యింది అని అక్కడి రిపోర్టర్స్ ఆగ్రహం వ్యక్తం చెయ్యగానే వినయంగా సారి చెప్పాడు అల్లు అర్జున్.
ఇక చెన్నైలో పుట్టి హైదరాబాద్ లో పెరిగి మలయాళం, కన్నడ లో అభిమానులని సంపాదించుకున్న తనకి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అంటే అమితమైన అభిమానమని చెప్పి బాలీవుడ్ ప్రేక్షకులని పడేసాడు. మరి హీరోగానే కాదు.. ఇటు సినిమా ప్రమోషన్స్ లోను నిజమైన హీరోలా కష్టపడ్డాడు అల్లు అర్జున్.. పుష్ప క్రెడిట్ మొత్తం అల్లు అర్జున్ కే ఇవ్వాలి.