Advertisementt

బిగ్ బాస్ 5: సన్నీ vs సిరి

Thu 16th Dec 2021 06:13 PM
bigg boss 5,bigg boss telugu,sunny vs siri,siri,shanmukh,sunny,manas  బిగ్ బాస్ 5: సన్నీ vs సిరి
Bigg Boss 5: Siri vs Sunny బిగ్ బాస్ 5: సన్నీ vs సిరి
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ సీజన్ 5 చివరి వారంలో టాప్ 5 కంటెస్టెంట్స్ బిగ్ బాస్ జర్నీ ఎమోషనల్ గా వెళ్ళింది. సన్నీ, మానస్, శ్రీరామ్ చంద్ర, షణ్ముఖ్, సిరి ల బిగ్ బాస్ జర్నీలో కంటెస్టెంట్స్ ఎమోషన్స్ బుల్లితెర ప్రేక్షకుల మనసులని టచ్ చేసాయి. ఇక మరో రెండు రోజుల్లో గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కి సిద్దమవుతున్న టాప్ 5 కంటెస్టెంట్స్ హౌస్ లో సందడి చేస్తూ.. ఇంకా ఇంకా గొడవలు పడుతూ.. బిగ్ బాస్ ఇచ్చే సిల్లీ టాస్క్ లు ఆడుతున్నారు. అందులో ముందుగా బెలూన్స్ ఊది పగలగొట్టే టాస్క్ లో సన్నీ కామెడీ మాములుగా లేదు. అలాగే లేబుల్ లేని టీ షర్ట్స్ తో స్విమ్మింగ్ పూల్ లో అటు ఇటు ఈదుతూ టి షర్ట్స్ మార్చుకోవాల్సి ఉంటుంది. దానిలో సన్నీ, షణ్ముఖ్ పోటీ పడగా.. షణ్ముఖ్ ఈదలేక పాకడం చూసిన శ్రీరామ్ పాకుతూ పాట్లు పడుతున్న షణ్ముఖ్ అంటూ కామెడీ చేసాడు.

ఇక ఈ రోజు ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ అందరూ బిగ్ బాస్ ఇచ్చే శబ్దాలను బట్టి అవేమిటో కనుక్కుని పేపర్ మీద రాయాల్సి ఉంటుంది అందులో కప్ప శబ్దం రాగా.. దానికి సన్నీ ఫ్రాగ్ స్పెల్లింగ్ తప్పు రాయడంతో.. సన్నీ మీరు రాసిన ఫ్రాగ్ స్పెల్లింగ్ చెప్పనగానే.. ఫ్రాగ్ అన్నాడు.. నువ్వు రాసింది చెప్పు సన్నీ అన్నాడు శ్రీరామ్. ఇక సిరి ని కూడా బిగ్ బాస్ ఆడుకున్నాడు. ఇంకా షణ్ముఖ్ మీరు లాస్ట్ లో రాసింది ట్రాక్టరా.. సిరి పేరునా అని అన్నాడు బిగ్ బాస్.. తర్వాత తాడట పెట్టాడు. అందులో సన్నీ నువ్ చక్కగా ఆడలేదు అంది సిరి. నువ్ ఓడిపోయావ్ గా అన్నాడు సన్నీ. 

నువ్వు ఓడిపోయి నువ్వు సరిగ్గా ఆడలేదు. షన్ను నువ్ బాగా అడావు అంటూ సిరి అంది.. దానితో సన్నీ నువ్ ఓడిపోయావని జోక్ అన్నాను మచ్చా అన్నా కూడా సిరి ఓడిపోయావ్ అన్నది జోకా అంది సిరి.. దానితో సిరి - సన్నీ మధ్యన మాటల యుద్ధం మొదలైంది. సిరి సీలిరాకాసిలా సన్నీపై పడిపోయింది. ఏమనుకుంటున్నావ్ అసలు నువ్వు అని వేలు చూపించిన సిరికి సన్నీ వేలు చూపియ్యకు అన్నాడు.. నన్ను ఇమిటేట్ చెయ్యకు అంటూ సిరి రెచ్చిపోయిన ప్రోమో వైరల్ గా మారింది.  

Bigg Boss 5: Siri vs Sunny:

Bigg Boss 5 Telugu latest promo viral

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ