బాలీవుడ్ సినిమాలు టాలీవుడ్ లో రిలీజ్ అయిన సందర్భాలే కాదు.. రీసెంట్ గా ప్రతి సినిమా టాలీవుడ్ లో రిలీజ్ అవుతుంటే.. టాలీవుడ్ దర్శకులు మాత్రం పాన్ ఇండియా మూవీస్ అంటూ ఐదు భాషలను టార్గెట్ చేస్తూ ముఖ్యంగా బాలీవుడ్ ని టార్గెట్ చేస్తూ సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ముందుగా రాజమౌళి బాహుబలితో బాలీవుడ్ భరతం పట్టాడు. తర్వాత ప్రభాస్ సాహోతో అదరగొట్టేసాడు. ఇక తాజాగా రెండు నెలలు పాటు టాలీవుడ్ మూవీస్ బాలీవుడ్ లో దండయాత్రకు సిద్దమయ్యాయి. ముందుగా అల్లు అర్జున్ పుష్ప తో ఐదు భషాల్లో డిసెంబర్17న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. పుష్ప సినిమాని ముంబై లో బడా ప్రెస్ మీట్ తో ప్రమోట్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసాడు.
ఇక ఈ నెలాఖరున నాని శ్యామ్ సింగరాయ్ నాలుగు భషాల్లో విడుదల కాబోతుంది. ఆ తర్వాత జనవరి 7 న రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ తో బాలీవుడ్ బాక్సాఫీసు షేక్ చెయ్యడానికి రెడీ అయ్యారు. ఇప్పటికే ముంబై ప్రెస్ మీట్ తోనే బాలీవుడ్ హీరోల గుండెల్లో దడ పుట్టించాడు. బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్, హీరోయిన్ అలియా భట్ లతో అక్కడి ప్రేక్షకుల మనసులు దోచేశాడు. జనవరి 7 న బాక్సాఫీసు షేకు కాదు.. దద్దరిల్లిపోవడమే అంటున్నారు. ఇక ఆ తర్వాత వారానికే ప్రభాస్ రాధేశ్యామ్ పాన్ ఇండియా మూవీ తో దిగిపోతున్నాడు. బాహుబలితో భారీ క్రేజ్ సంపాదించుకున్న ప్రభాస్.. రాధేశ్యామ్ పై బాలీవుడ్ మంచి అంచనాలున్నాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 4న మెగాస్టార్ కూడా ఆచార్య మూవీని హిందీలో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. సో ఈ రెండు నెలలు బాలీవుడ్ పై టాలీవుడ్ దండయాత్ర ఏకధాటిగా కొనసాగుతుందన్నమాట.