కరోనా పాండమిక్ సిట్యువేషన్ లో సినిమా ఇండస్ట్రీ కుదేలైంది.. ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాల రిలీజ్ లతో బాక్సాఫీసుకి ఊపు వచ్చింది. ప్రస్తుతం పాన్ ఇండియా మూవీస్ రిలీజ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీ కళకళలాడుతుంటే.. ఏపీ ప్రభుత్వం మాత్రం టాలీవుడ్ పై కక్ష పట్టింది. టికెట్ రేట్స్ విషయంలో, రోజుకు నాలుగు షోస్ నిబంధన విషయంలో మంకు పట్టు పట్టుకుని కూర్చుంది.. ఎలాగో ఏపీ హై కోర్టు టికేట్ రేట్స్ విషయంలో ఏపీ ప్రభుత్వం చేసిన చట్టం చెల్లదని తీర్పు ఇవ్వడంతో ఊపిరిపీల్చుకుంటున్న టాలీవుడ్ ని ఏపీ ప్రభుత్వం ఊరుకునేలా లేదు.. మళ్ళీ సింగిల్ బెంచ్ తీర్పుని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ వేసింది. ఈ విచారణ సోమవారానికి వాయిదా వేసింది. కోర్టు..
ఇక రేపు శుక్రవారం రిలీజ్ కాబోతున్న అల్లు అర్జున్ పుష్ప సినిమా టికెట్స్ ని పెంచుకునే అవకాశం ఏర్పడింది. అదొక శుభసూచకం. అయితే.. ఏపీలో రోజుకు నాలుగు షోస్ కి మాత్రమే కోర్టు అనుమతి ఇచ్చింది. తెలంగాణాలో మాత్రం పుష్ప సినిమాకి రోజుకి ఐదు ఆటలకి అనుమతి ఇవ్వడం పుష్ప మేకర్స్ కి ఊరటనిచ్చింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప ఫిలిం ఐదు భాషల్లో రేపు డిసెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తాజాగా పుష్ప సినిమాకి రోజుకి ఐదు ఆటలు ప్రదర్శించుకునేలా తెలంగాణ ప్రభుత్వం అనుమతినిచ్చింది. తెలంగాణ ప్రభుత్వం పుష్ప చిత్రానికి 5 వ షో కి అధికారికంగా అనుమతి జారీ చేసింది.
సో ఆంధ్రలో 4 ఆటలకి, తెలంగాణాలో ఐదు ఆటలకి అనుమతి లభించింది పుష్ప సినిమాకి. ఇక తెలంగాణాలో ఈ నెల 30 వరకు ఐదు ఆటల ప్రదర్శనకు పుష్ప మేకర్స్ కి అనుమతి లభించింది.