అల్లు అర్జున్ ఈ ఏడాది మొదట్లో జనవరిలో అందరికన్నా ముందే పుష్ప సినిమాని ఆగష్టు 13 న రిలీజ్ చేస్తున్నామని.. వరల్డ్ వైడ్ గా ఆగష్టు 13న పుష్ప మూవీ అంటూ రిలీజ్ డేట్ ఇచ్చి సుకుమార్ ని లాక్ చేసేసాడు. కానీ సుకుమార్ అదృష్టమో.. లేదంటే మరేదన్నానో.. కరోనా సెకండ్ వేవ్, అలాగే అల్లు అర్జున్ కరోనా బారిన పడడం, మధ్యలో సుకుమార్ డెంగ్యూ ఫీవర్ తో సిక్ అవడంతో.. ఆగష్టు 13 న రావాల్సిన పుష్ప పోస్ట్ పోన్ అయ్యింది. మళ్ళీ డిసెంబర్ 24 న పుష్ప రిలీజ్ అన్నారు. కానీ బాలీవుడ్ మూవీస్ పోటీకి వచ్చేసరికి.. ఎందుకులే అని డిసెంబర్ 17 కి పుష్ప ని ప్రీ పోన్ చేసుకున్నారు. కానీ పుష్ప సినిమాని పోస్ట్ పోన్ చెయ్యాల్సింది పోయి ప్రీ పోన్ చేసి తప్పు చేశారేమో అని.. ఇప్పుడు పుష్ప ప్రమోషన్స్ కష్టాలను చూస్తే అనిపిస్తుంది. అదే డిసెంబర్ 24న గనక పుష్ప రిలీజ్ అయ్యుంటే.. ప్రమోషన్స్ కి, మిగతా పనులకి పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేది.
కానీ వారం ముందుకు వచ్చి.. పుష్ప టీం బాగా ఇరుక్కుంది. ఆఖరికి తెలుగులో కన్నడ అమ్మాయి అయిన రష్మిక డబ్బింగ్ చెప్పింది.. కానీ.. మాతృభాష కన్నడలో రశ్మికకి డబ్బింగ్ చెప్పే టైం లేదని చెప్పింది. దానితో రష్మిక కేరెక్టర్ కి వేరే కన్నడ డబ్బింగ్ ఆర్టిస్ట్ తో డబ్బింగ్ చెప్పించారు. ఇక ప్రమోషన్స్ విషయంలో ఇంతవరకు ముంబైలో అడుగుపెట్టలేదు.. తీరా చూస్తే రేపు సినిమా రిలీజ్. మరోపక్క పుష్ప హిందీ సెన్సార్ ఆగిపోయింది. పుష్ప పూర్తి సినిమా ఇస్తే గానీ, ఈ సినిమాని సెన్సార్ చేయలేమని హిందీ సెన్సార్ బోర్డు చెప్పడంతో.. ఇప్పుడు పుష్ప టీం దిక్కుతోచని పరిస్తితుల్లో పడింది. మరోపక్క సుకుమార్ ఇంకా ఇంకా పుష్ప పోస్ట్ ప్రొడక్షన్ లో తలమునకలై ఉన్నారు. రాత్రి బవళ్ళు పని చేసినా ఎక్కడిపనులు అక్కడే ఉన్న ఫీలింగ్.
పుష్ప పార్ట్ 1 ని వచ్చే ఏడాదికి షిఫ్ట్ చేస్తే.. పుష్ప పార్ట్ 1 అండ్ 2 ఒకే ఏడాది రిలీజ్ చేసారు అంటారని.. ఇలా పుష్ప కి త్వరపడి రిలీజ్ డేట్ ఇచ్చి చిక్కుల్లో పడింది టీం. మరి నిజంగా ఇప్పుడు పుష్ప కి త్వరపడి డేట్ లాక్ చేసి తప్పు చేశారేమో అనిపిస్తుంది.