Advertisementt

మహేశ్-త్రివిక్రమ్ మూవీపై సర్‌ప్రైజింగ్ న్యూస్

Wed 15th Dec 2021 10:43 PM
mahesh babu,trivikram,mahesh-trivikram movie,february,pooja hegde  మహేశ్-త్రివిక్రమ్ మూవీపై సర్‌ప్రైజింగ్ న్యూస్
Surprise News on Mahesh-Trivikram Movie మహేశ్-త్రివిక్రమ్ మూవీపై సర్‌ప్రైజింగ్ న్యూస్
Advertisement
Ads by CJ

సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో  మళ్ళీ ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయ్యేది ఎప్పుడు రిలీజ్ అయ్యేదే అనే దాని మీద కొంచెం క్లారిటీ మాత్రం వచ్చింది. ఈ చిత్ర షూటింగ్ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి లో స్టార్ట్ చేస్తారని తెలిసింది. ప్రస్తుతం మహేష్ బాబు దుబాయ్ లో వున్నారు. కొత్త సంవత్సరం వరకు అక్కడే వుండి ఆ తరువాత జనవరి మొదటి వారంలో సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ చేస్తారు. మహేష్ లేకుండా వున్నా సీన్స్ ఇప్పుడు డైరెక్టర్ పరశురామ్ హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్నారు.

ఇది ఇలా ఉండగా మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ సినిమా ఫిబ్రవరి లో స్టార్ట్ చేస్తారని తెలిసింది. ఆ సినిమా బౌండ్ స్క్రిప్ట్ తో రెడీగా ఉండటం వలన  త్రివిక్రమ్ తొందరగా కంప్లీట్ చెయ్యాలని చూస్తున్నారు. ఆగస్టుకి త్రివిక్రమ్ సినిమా కంప్లీట్ చేసి ఆ తరువాత దసరా పండగకు రిలీజ్ చెయ్యాలని చూస్తున్నారు. ఎందుకంటే మహేష్ తన తరువాత సినిమా రాజమౌళి తో చెయ్యాల్సి వుంది. ఈ రాజమౌళి మహేష్ కాంబినేషన్ సినిమా చాల సంవత్సరాల నుండి అనుకుంటున్నారు అది ఇప్పటికి కార్యరూపం దాల్చింది. ఆ సినిమా ఇంకా లేట్ చెయ్యడానికి కూడా పనికిరాదు, అందుకనే త్రివిక్రమ్ సినిమాని ఆరు నెలల్లో కంప్లీట్ చెయ్యాలని చూస్తున్నారు. ఆగస్టు లో రాజమౌళి తో సినిమా మొదలు అవుతుంది. ప్రస్తుతం మహేష్ దుబాయ్ లో రెస్ట్ తీసుకుంటున్నారు.

Surprise News on Mahesh-Trivikram Movie:

Mahesh-Trivikram Movie starts in February

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ