కన్నడ బ్యూటీ రష్మిక మందన్న.. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గానే కాదు.. బాలీవుడ్ లో చక్రం తిప్పుతుంది. పర్ఫెక్ట్ జిమ్ తో బాడీ ని తీగలా మార్చుకున్న రష్మిక గ్లామర్ పరంగాను దూసుకుపోతుంది. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన రష్మిక నటించిన పాన్ ఇండియా ఫిలిం పుష్ప రేపు శుక్రవారమే విడుదల కాబోతుంది. ప్రస్తుతం రిలీజ్ ప్రమోషన్స్ హడావిడిలో రష్మిక తిరుగుతుంది. ఇక రష్మిక పుష్ప ప్రీ రిలీజ్ ఈవెంట్, అలాగే పుష్ప ఇంటర్వూస్ అంటూ హైదరాబాద్ లో, బెంగుళూరు, కొచ్చి లో అల్లు అర్జున్ తో పుష్ప ప్రెస్ మీట్స్ లో గ్లామర్ గా సందడి చేస్తుంది. అయితే రష్మిక రీసెంట్ గా సామీ సామీ సాంగ్ కోసం నేనెంతో కష్టపడి పనిచేశా. ఆ సాంగ్ లో నా డాన్స్ చూశాక అందరూ నన్ను మెచ్చుకుంటే చాలు. నేను దర్శకుల హీరోయిన్ ని, దర్శకులు ఎలా చెబితే అదే నేను చేస్తా అంటూ ఉన్న వీడియో ని షేర్ చేసింది.
అయితే ఆ వీడియో చూసిన నెటిజెన్.. పుష్ప లో రష్మికాని హీరోయిన్ గా తీసుకోకుండా ఉండాల్సింది. రష్మిక చేసే ఓవరేక్షన్ చూడలేక చస్తున్నాం అంటూ కామెంట్ చెయ్యడంతో.. దానికి రష్మిక నెటిజెన్ దిమ్మతిరిగే రిప్లై ఇచ్చింది. నేను యాక్టింగ్ చేస్తున్నానో, ఓవర్ యాక్టింగ్ చేస్తున్నానో.. నేను లైఫ్ లో ఏదో ఒకటి సాధించాను, మరి నువ్వేం సాధించావ్ అంటూ రిప్లై ఇచ్చింది. మొన్నామధ్యన కూడా రష్మిక పిక్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. అసలు రశ్మికకి ఆఫర్స్ ఎందుకు ఇస్తున్నారు.. ఈ అమ్మాయి ఏం బావుంటుంది అంటూ కామెంట్ చేసిన వారికి కూడా రష్మిక ఇలాంటి దిమ్మతిరిగే సమాధానమే ఇచ్చింది.